NTV Telugu Site icon

Anand Devarakonda : ‘హైవే’ ఎక్కేది ఎప్పుడంటే….

High Way

High Way

 

ఆనంద్ దేవ‌ర‌కొండ ప్రధాన పాత్రను పోషించిన సినిమా ‘హైవే’. కె.వి. గుహన్ తెరకెక్కించిన ఈ మూవీ ఆగ‌స్ట్ 19న ఆహాలో డైరెక్ట్ రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ట్రైల‌ర్‌ను మంగ‌ళ‌వారం హీరో నాగ‌శౌర్య విడుద‌ల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ”ట్రైలర్ చూస్తుంటే.. ఒక ‘ఆవారా’, ఒక ‘రాక్షసన్’ చిత్రాలు చూసినట్టుంది. ‘హైవే’ పేరు వినగానే పాజిటివ్ గా అనిపించింది. నాకు లవర్ బాయ్ అని ప్రేక్షకులు ట్యాగ్ ఇచ్చారు. కానీ ఆనంద్ ఇమేజ్ చట్రంలో ఇరుక్కోకుండా భిన్నమైన చిత్రాలు చేస్తున్నారు. ‘దొరసాని, మిడిల్ క్లాస్ మెలోడిస్, పుష్పక విమానం’ డిఫరెంట్ జానర్స్ చేశాడు. అతని స్క్రిప్ట్ సెలెక్షన్ అద్భుతంగా ఉంటోంది” అని అన్నారు.

ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ, ”మా ఈవెంట్‌కు వచ్చిన నాగ శౌర్యకు థాంక్స్. ఈ మూవీ సీటు అంచున కూర్చోబెట్టేస్తుంది. కొత్త చిత్రాలను చేయాలని అనుకునే నేను ఇండస్ట్రీకి వచ్చాను. జయాపజయాలతో నిమిత్తం లేకుండా డిఫరెంట్ జానర్స్ ట్రై చేస్తున్నాను. అలాంటి సమయంలోనే కేవీ గుహన్ సర్.. వెరైటీ కథతో వచ్చారు. ఇది ప్రయోగాత్మక చిత్రం. కరోనా టైమ్ లో అతి తక్కువ మందితో షూట్ చేసి అద్భుతమైన అవుట్ పుట్ తీసుకొచ్చారు. నాకు ఈ ప్రాజెక్ట్ ఇచ్చిన వెంకట్ సర్‌కు థాంక్స్. ‘మిడిల్ క్లాస్ మెలోడిస్’ టైం నుంచి శరత్ మరార్ నాకు ఎంతో సపోర్టివ్ గా ఉంటున్నారు. నేను చేసిన మూడు సినిమాల్లో కేవీ గుహన్ ఎక్స్‌పిరీయన్స్ ఉన్నవారు. ఆయన సినిమాటోగ్రఫీ అందించిన ‘అతడు’ నా ఫేవరేట్ మూవీ.ఆయనతో పని చేయడం నాకు ఆనందంగా ఉంది. ఆయనతో మళ్లీ మళ్లీ పని చేయాలని అనుకుంటున్నాను” అని చెప్పారు.

కేవీ గుహన్ మాట్లాడుతూ, ”కరోనా తరువాత కంటెంట్‌లో మార్పులు వచ్చాయి. ప్రేక్షకుల అభిరుచి మారింది. ఓటీటీ వల్ల కొత్త జానర్లను ట్రై చేసేందుకు అవకాశం ఏర్పడింది. ఇది రెగ్యులర్ హీరోయిక్ సినిమాల్లా ఉండదు. ఓ పాత్రలా ఉంటుంది. అయినా ఆనంద్ దేవరకొండ కథ విని అంగీకరించారు. అందుకు స్పెషల్‌గా థాంక్స్ చెప్పాలి. ‘పాతాళ్ లోక్’ వెబ్ సిరీస్ నాకు చాలా ఇష్టం. అందులో నటించిన అభిషేక్‌ను ఈ చిత్రంలో తీసుకున్నాను. ఓ అమాయకత్వం ఉన్న అమ్మాయి కోసం వెతికాను. మానసలో ఆ ఇన్నోసెన్స్ కనిపించింది. ఈ చిత్రం కోసం పని చేసిన అందరూ కూడా త్వరలోనే మరింత ఉన్నత స్థాయికి వెళ్తారు.

సైమన్ పాటలతో ఊపిరి ఇచ్చారు. ఎడిటర్ తమ్మరాజు, నిరంజన్ గారికి థాంక్స్. సరైన సినిమా వచ్చినప్పుడు దానికి ఓ ఫ్లాట్ ఫాం కావాలి. ఇలా ఆహా మా సినిమాను తీసుకుంది” అని అన్నారు. హీరోయిన్ మానస మాట్లాడుతూ.. ”నాకు తెలుగులో ఇది మొదటి చిత్రం. నాకు ఈ అవకాశం ఇచ్చిన వెంకట్ సర్‌కు, తులసి పాత్రను ఆఫర్ చేసిన గుహన్ సర్‌కు థాంక్స్. మా హీరో ఆనంద్ దేవరకొండ ఎంతో మంచి వ్యక్తి. మా ట్రైలర్ లాంచ్‌కు వచ్చిన హీరో నాగ శౌర్యకు థాంక్స్. అందరూ ఈ మూవీ చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను” అని అన్నారు.