NTV Telugu Site icon

Trivikram Srinivas: గురూజీ బర్త్ డే సందర్భంగా ‘బుట్టబొమ్మ’ టీజర్!

Butta Bomma

Butta Bomma

Butta Bomma: అనిక సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ట ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న సినిమా ‘బుట్టబొమ్మ’. ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లో నాగవంశీ ఎస్, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీతో శౌరి చంద్రశేఖర్ రమేశ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ సినిమా టీజర్ ను సోమవారం విడుదల చేశారు.

ఈ ప్రచార చిత్రం సినిమా మీద అంచనాలను పెంచే విధంగా ఉంది. పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కిన ప్రేమకథ అని తెలుస్తోంది. “మళ్లీ ఎప్పుడు కాల్ చేస్తావ్’ అని హీరో అంటే ‘ఇంకోసారి చెయ్యాలంటే … ఇప్పుడు కాల్ కట్ చెయ్యాలి గా’ అని హీరోయిన్ బదులివ్వడంతో ఆ పాత్రల మధ్య ఉన్న ఎలాంటి ప్రేమానుబంధం ఉందో దర్శకుడు చెప్పకనే చెప్పాడు. అరవై ఐదు క్షణాల పాటు సాగే ఈ వీడియోలో వంశీ పచ్చి పులుసు ఛాయాగ్రహణం, గోపీసుందర్ సంగీతం చిత్రాన్ని మరో మెట్టెక్కిస్తాయనిపించింది.

టీజర్ విడుదల సందర్భంగా చిత్ర దర్శకుడు శౌరి చంద్రశేఖర్ రమేష్ మాట్లాడుతూ, ”గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథ సహజంగా సాగుతూ ఆకట్టుకుంటుంది. ప్రేమలోని పలు సున్నితమైన పార్శ్వాలను స్పృశిస్తూ చిత్ర కథ, కథనాలు ఉంటాయి” అని చెప్పారు. ‘వరుడు కావలెను’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న గణేష్ కుమార్ రావూరి ఈ చిత్రానికి మాటలు అందిస్తున్నారు. చిత్ర నిర్మాణ కార్యక్రమాలు దాదాపుగా పూర్తి కావస్తున్నాయని, విడుదల తేదీ, ఇతర వివరాలు ఒక్కొక్కటిగా తెలియ పరుస్తామని తెలిపారు నిర్మాతలు. నవ్య స్వామి, నర్రా శ్రీను, పమ్మి సాయి, కార్తీక్ ప్రసాద్, వాసు ఇంటూరి, ప్రేమ్ సాగర్, మిర్చి కిరణ్, కంచెర్ల పాలెం కిషోర్, మధుమణి తదితరులు ఇందులో ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.