Senior Hero : సినిమా సినిమాకు వేరియేషన్ చూపిస్తున్న హీరో

R Madhavan

R Madhavan

ఇండస్ట్రీలో మూవీ మూవీకి గెటప్ అండ్ రోల్‌లో వేరియేషన్ చూపిస్తూ వర్సటైల్ యాక్టర్‌గా పేరు తెచ్చుకుంటున్నాడు మాధవన్. ఓ వైపు సపోర్టింగ్ రోల్స్ చేస్తూనే.. మరో వైపు లీడ్ రోల్స్‌లోనూ అదరగొట్టేస్తున్నారు. ధురంధర్‌లో డిఫరెంట్ లుక్స్‌లో మెస్మరైజ్ చేసిన మ్యాడీ.. మరో ఎక్స్‌పరిమెంట్ మూవీతో వచ్చేస్తున్నాడు. మాధవన్ వన్స్ ఆపాన్ ఎ టైం అమ్మాయిలకు కలల రాకుమారుడు. కానీ నేడు వర్సటైల్ యాక్టర్. హీరోగా మార్కెట్ కోల్పోయాక సపోర్టింగ్ రోల్స్ షిఫ్టయ్యాడు. తండ్రిగా మెప్పించాలన్నా, విలన్‌గా భయపెట్టాలన్నా, సపోర్టివ్ క్యారెక్టర్‌తో సినిమాకు హైప్ తేవాలన్నా ఇతడే ఛాయిస్‌గా మారాడు.

సవ్యసాచి, నిశ్శబ్దం.. రెండేళ్ల క్రితం వచ్చిన సైతాన్‌లో యాంటోగనిస్టుగా అదిరిపోయే ఫెర్ఫామెన్స్ చూపించిన మాధవన్.. దేదే ప్యార్ దే2లో ఏజ్‌లో తన కన్నా పెద్దవాడైన అజయ్ దేవగన్‌కు మామగా మారిపోయాడు. రీసెంట్లీ ధురంధర్ సిరీస్ చిత్రాల్లో ఇంటలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సంజ్యాల్ క్యారెక్టర్‌లో కొత్తగా కనిపించాడు మ్యాడీ. అలాగే ఛాన్స్ దొరికినప్పుడల్లా లీడ్ రోల్స్‌లో మెప్పిస్తూ వావ్ అనిపిస్తున్నాడు. రాకెట్ నంబియార్‌లో ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్ పాత్రలో మెప్పించాడు మాధవన్. అతడి నటనకు, మేకోవర్‌కు తగిన ప్రతిఫలం దక్కింది. జాతీయ అవార్డ్ వరించింది. నెక్ట్స్ మరో ప్రయోగానికి రెడీ అయ్యాడు. ప్రముఖ ఆవిష్కర్త, పారిశ్రామిక వేత్త జీడీ నాయుడు జీవిత కథతో రాబోతున్నాడు. ఇందులో కూడా గుర్తు పట్టలేని విధంగా లుక్స్‌లో కొత్తగా కనిపిస్తున్నాడు మ్యాడీ. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఫిల్మ్