Site icon NTV Telugu

అమితాబ్ కార్ సీజ్… కారణం సల్మాన్ ఖాన్ !!

Amitabh

ఇటీవల కర్ణాటకలోని బెంగళూరులో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. వాహనాల భీమా గడువు ముగియడం. పన్ను చెల్లించని లగ్జరీ వాహనాలపై దృష్టి పెట్టింది కర్ణాటక రవాణా శాఖా. అందులో భాగంగానే జప్తు చేసిన 7 లగ్జరీ వాహనాలలో 5 పుదుచ్చేరిలో రిజిస్టర్ చేయబడ్డాయి. మహారాష్ట్రలో రెండు నమోదయ్యాయి. అయితే స్వాధీనం చేసుకున్న వాహనాల్లో చాలా వరకు పూర్తి పత్రాలు లేవు. బీమా కూడా లేదు. వీటిలో చాలా వాహనాల బీమా గడువు కూడా ముగిసింది. ఈ క్రమంలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ కారును కూడా సీజ్ చేశారు రవాణా శాఖ అధికారులు. పైగా ఈ కారు నడుపుతుంది అమితాబ్ కావడం అసలు ట్విస్ట్. వివరాల్లోకి వెళ్తే…

కర్ణాటక రవాణా శాఖ MH 02 BB 2 నంబర్ ప్లేట్ ఉన్న రోల్స్ రాయిస్-ఫాంటమ్ కారును స్వాధీనం చేసుకున్నారు. అయితే అది అమితాబ్ బచ్చన్ పేరు మీద ఉన్నట్లు పోలీసులకు తెలిసింది. 2007 సంవత్సరంలో ‘ఏక్ లవ్య’ చిత్రం విడుదలైన తర్వాత విధు వినోద్ చోప్రా ఈ కారును అమితాబ్ బచ్చన్‌కు బహుమతిగా ఇచ్చారు. 2019 సంవత్సరంలో బిగ్ బి ఈ రోల్స్ రాయిస్-ఫాంటమ్ కారును యూసుఫ్ షరీఫ్ అనే వ్యక్తికి అమ్మేశారు. అయితే కారుకు సంబంధించిన పత్రాలు మాత్రం ఇంకా అమితాబ్ పేరు మీదే ఉంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కారు నడుపుతున్న వ్యక్తి పేరు సల్మాన్ ఖాన్. 35 ఏళ్ల సల్మాన్ తన తండ్రి ఈ కారును అమితాబ్ బచ్చన్ నుండి కొనుగోలు చేసినట్లు పోలీసులకు చెప్పాడు.

నిబంధనల ప్రకారం ఇతర రాష్టాల నుంచి తీసుకొచ్చిన కార్లను ఆ రోజు నుంచి 11 నెలల లోపు స్థానిక రవాణా శాఖా ఆఫీసులో రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఏ వాహనాన్ని మరొక రాష్ట్ర రిజిస్ట్రేషన్ నంబర్‌తో నడపడానికి అనుమతించరు. కానీ ఈ కారు అమితాబ్ బచ్చన్ నుండి ఫిబ్రవరి 27, 2019న కొనుగోలు చేశారు. కారు యజమాని దీనికోసం దాదాపు రూ.6 కోట్లు చెల్లించినట్లు చెప్పాడు. అయితే ఆయన దగ్గర కారుకు సంబంధించి అధికారులకు చూపించాల్సిన డాక్యూమెంట్స్ లేవు. కానీ బచ్చన్ ద్వారా వచ్చిన బదిలీ లేఖను చూపించాడు.

Exit mobile version