Site icon NTV Telugu

పాదాలతో ఫ్యాన్ ఆర్ట్… అమితాబ్ ఫిదా

Amitabh Bachchan Thanks Specially Abled Artist For Gulabo Sitabo Fan-art

బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ కు కళల పట్ల మంచి అభిరుచి ఉంది. ఆయన తన అభిమానులు వేసే అద్భుతమైన పెయింటింగ్ ఫోటోలను తరచుగా సోషల్ మీడియాలో పంచుకుంటారు. అమితాబ్ బచ్చన్ ఇటీవల తన అభిమానులలో ఒక ప్రత్యేక వ్యక్తి వేసిన పెయింటింగ్ కు సంబంధించిన ఫోటోను పంచుకున్నారు. యువ అభిమాని కళాత్మక నైపుణ్యాలతో తనను ఆకట్టుకున్నాడు అంటూ ఈ బాలీవుడ్ లెజెండ్ ఆ ఫోటోను షేర్ చేశారు. అందులో ఓ యువకుడు అమితాబ్ నటించిన ‘గులాబో సితాబో’ సినిమా నుంచి ఆయన లుక్ ను గీశారు. అయితే ఆ అభిమాని తన చేతులతో కాకుండా పాదాలతో దానిని గీసాడని అమితాబ్ బచ్చన్ వెల్లడించారు. ఆ ఆర్టిస్ట్ పేరు ఆయుష్ అని బిగ్ బి పేర్కొన్నారు. ఆయుష్ ప్రత్యేక సామర్థ్యం ఉన్నవాడని, తన చేతులను ఉపయోగించలేడు కానీ కాళ్ళతోనే అద్భుతమైన పెయింటింగ్ వేయగలదని అమితాబ్ వెల్లడించాడు.

Read Also : టాలీవుడ్ లో విషాదం… ప్రముఖ నిర్మాత కన్నుమూత

ఆయుష్‌ని అమితాబ్ కలిసి, ఆయన ఆ బొమ్మల్ని ఎలా గీస్తున్నారు అనే విషయాన్ని స్వయంగా చూశారట. తన బొమ్మను అద్భుతంగా గీసి బహుమతిగా ఇచ్చినందుకు ఆ యువ కళాకారుడికి అమితాబ్ కృతజ్ఞతలు తెలిపారు. సోషల్ మీడియాలో ఈ బాలీవుడ్ మెగాస్టార్ అభిమాని గురించి షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Exit mobile version