NTV Telugu Site icon

Rashmika: ‘యానిమల్’లో రచ్చ లేపావ్.. రష్మికపై అమితాబ్ ప్రశంసలు

Rashmika Mandannna Pramod Kumar

Rashmika Mandannna Pramod Kumar

Amitabh Bachchan praises Rashmika Mandanna’s stellar performance in Animal: కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమంలో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న అభిమానితో మాట్లాడింది. ఇక ఇదే క్రమంలో యానిమల్ సినిమాలో రష్మిక పర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది అంటూ బిగ్ బి అమితాబ్ ప్రశంసలు కురిపించారు. రష్మిక మందన్న ఇండస్ట్రీలో సెన్సేషన్‌గా మారి నేషనల్‌ క్రష్‌గా ఎదిగింది. అల్లు అర్జున్ “పుష్ప: ది రైజ్”లో ఆమె నటనతో నేషనల్ వైడ్ గుర్తింపు దక్కించుకోగా ఆమెకు విస్తృతమైన ప్రశంసలు లభించాయి. బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి, ఆమె “గుడ్‌బై”లో అమితాబ్ బచ్చన్‌తో స్క్రీన్‌ను పంచుకుంది, ఒక రకంగా ఆమెకు హిందీలో ది బెస్ట్ లాంచ్ అని చెప్పచ్చు. ఆ తరువాత ఆమె “మిషన్ మజ్ను”లో కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు మరోసారి రష్మిక తాజాగా విడుదలైన “యానిమల్”లో తన అసాధారణ నటనతో ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ క్రమంలోనే అమితాబ్ బచ్చన్ తన ‘గుడ్‌బై’ సహనటి రష్మిక మందన్న పై ప్రశంసల వర్షం కురిపించారు, ఇటీవల చిత్రం ‘యానిమల్’లో ఆమె అద్భుతమైన నటనను మెచ్చుకున్నారు. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా నిర్వహిస్తున్న కౌన్ బనేగా కరోడ్ పతి 15 కార్యక్రమంలో సందడి చేసింది స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న.

Animal: 9వ రోజు 60 కోట్లు కలెక్ట్ చేశాడా? అరాచకం అనేది కూడా చిన్న పదంలా ఉంది

ఈ క్రమంలో ఆమె అభిమాని మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన కంటెస్టెంట్ ప్రమోద్ భాస్కర్ తో వీడియో కాల్ లో మాట్లాడింది. ప్రమోద్ భాస్కర్ అనే కంటెస్టెంట్ రష్మిక మందన్నకు పెద్ద అభిమాని, ఆమెను సోషల్ మీడియాలో ఫాలో అ‌వుతుంటారు. ఇక ఇదే విషయాన్ని అమితాబ్ దృష్టికి తీసుకు వెళ్లగా అమితాబ్ అతనికి స్వీట్ షాక్ ఇచ్చారు. తన ఫేవరేట్ హీరోయిన్ వీడియో కాల్ లో మాట్లాడేసరికి ప్రమోద్ సర్ ప్రైజ్ అయ్యారు, ఆమెను ఎంతగానో అభిమానిస్తున్నాని, పర్సనల్ గా కలిసి మాట్లాడాలని ఉందని ప్రమోద్ అడగగా..రష్మిక కూడా తప్పకుండా మీట్ అవుదామని హామీ ఇచ్చింది. అలాగే ఆమె మాట్లాడుతూ తన ఫ్యాన్ అయిన ప్రమోద్ కౌన్ బనేగా కరోడ్ పతి ప్రోగ్రాంలో కంటెస్టెంట్ గా ముందుకు వెళ్లడం హ్యాపీగా ఉందని రష్మిక చెప్పుకొచ్చింది. అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ రష్మిక ప్రతి సినిమాను చూస్తున్నామని, ఇటీవల యానిమల్ సినిమాలో ఆమె పర్ఫార్మెన్స్ ఎంతో ఆకట్టుకుంది అని అన్నారు, ఇక ప్రశంసల నేపథ్యంలో రష్మిక అమితాబ్ కు థ్యాంక్స్ చెప్పింది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ‘యానిమల్’లో రణ్‌బీర్ కపూర్, అనిల్ కపూర్, బాబీ డియోల్ వంటి వారు కీలక పాత్రలలో నటించారు. తృప్తి డిమ్రీ, శక్తి కపూర్, ప్రేమ్ చోప్రా, సురేష్ ఒబెరాయ్ వంటి వారు కూడా నటించారు.

Show comments