నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన ‘అమిగోస్’ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. ట్రిపుల్ రోల్ లో కళ్యాణ్ రామ్ కనిపించనున్న ఈ మూవీ ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. అమిగోస్ సినిమాతో కళ్యాణ్ రామ్ హిట్ కొడతాడు, ఒక డిఫరెంట్ సినిమాని రిలీజ్ చేస్తున్నాం అనే నమ్మకం కలిగించడంలో మేకర్స్ సక్సస్ అయ్యారు. ఈ మూవీ కన్నడ బ్యూటీ అషిక రంగనాథ్ కి కూడా మంచి డెబ్యు అయ్యేలా ఉంది. కన్నడలో శివన్న, కిచ్చా సుదీప్ లాంటి హీరోస్ పక్కన నటించిన అషిక, తెలుగులో నటించిన మొదటి సినిమా ‘అమిగోస్’. మేకర్స్ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ లో అషిక ప్రామిసింగ్ గా కనిపిస్తోంది. ముఖ్యంగా ‘ఎన్నో రాత్రులు’ సాంగ్ లో అషిక చేసిన డాన్స్ అండ్ గ్లామర్ షోకి యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. సాంగ్ కి ఎంత కావాలో అంత గ్లామర్ గా కనిపించడంతో అషిక రంగనాథ్ కి తెలుగులో ఫాలోయింగ్ పెరుగుతోంది.
రీసెంట్ గా బ్లాక్ డ్రెస్ లో మోడరన్ లుక్ అషిక రంగనాథ్ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోస్ ని పోస్ట్ చేసింది. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే అషిక పోస్ట్ చేసిన ఫోటోస్ చూసిన ఫాన్స్, కళ్యాణ్ రామ్ హీరోయిన్ గ్లామర్ లుక్స్ బాగానే ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. అమిగోస్ సినిమా హిట్ అయితే అషిక రంగనాథ్ తెలుగులో బిజీ అయ్యే ఛాన్స్ ఉంది. గ్లామర్, డాన్స్ లాంటి విషయాల్లో అషిక ఇప్పటికే ఆకట్టుకుంది కాబట్టి అమిగోస్ సినిమాలో పెర్ఫార్మెన్స్ కూడా బాగా చేస్తే అషిక కెరీర్ కి మంచి బూస్టింగ్ వచ్చినట్లే అవుతుంది. ఇప్పటికే తెలుగులో కన్నడ నుంచి వచ్చిన అనుష్క శెట్టి లేడీ సూపర్ స్టార్ అయ్యింది. పూజా హెగ్డే పాన్ ఇండియా హీరోయిన్ అవ్వగా, యంగ్ బ్యూటీ శ్రీలీలా తెలుగులో టాప్ హీరోయిన్ అయ్యే రేసులో ఉంది. బిగ్ స్టార్స్ తో నటిస్తూ బిజీ బిజీగా ఉంది. మరి ఈ కొత్త హీరోయిన్ అషిక ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.
— Ashika Ranganath (@AshikaRanganath) February 2, 2023