Ameesha Patel: బద్రి సినిమాతో ఒక్కసారిగా తెలుగు కుర్రాళ్లను వలలో వేసుకున్న హీరోయిన్ అమీషా పటేల్. ఈ సినిమాతో ముద్దుగుమ్మకు ఎక్కడలేనన్ని అవకాశాలు వచ్చాయి కానీ ఆశించిన ఫలితం మాత్రం అందుకోలేదు. ఇక కొన్నేళ్లు గ్యాప్ తీసుకొని మహేష్ బాబు తో కలిసి నాని లో కనిపించి అందాలు ఆరబోసింది. అయినా అమందికి టాలీవుడ్ కలిసి రాలేదు. ఇక దీంతో బాలీవుడ్ లోనే పాగా వేసి స్టార్ హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం అమీషా వయసు 56. అడపాదడపా సినిమాలో కనిపిస్తూ, వివాదాలతో ఫేమస్ అయ్యింది. ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. చిట్టిపొట్టి డ్రెస్ లు వేసుకొని అందాల ఆరబోతకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయింది. అందుకే అమీషాకు ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ఎక్కువే.
ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ ఢిల్లీలో ఎంజాయ్ చేస్తోంది. ఒక సినిమా షూటింగ్ కోసం వెళ్లిన అమీషా హోటల్ బాత్రూమ్ లో ఒక వీడియోను షేర్ చేసింది. తలస్నానం చేసిన తరువాత తలను హెయిర్ డ్రయర్ తో ఆరబెడుతూ అద్దం ముందు హొయలు పోతూ కనిపించింది. అప్పుడు కూడా అమ్మడు క్లివేజ్ షోను మాత్రం మరువలేదు. వైట్ బాత్ డ్రెస్ లో ఎద అందాలను ఎరగా వేసి విజిల్ ఊదుతూ జుట్టును ఆరబెట్టుకొంటుంది. ఇక ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో పై నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. కొంతమంది హాట్ అని కామెంట్స్ పెడుతుండగా.. మరికొందరు వయసు మీద పడినట్లు కనిపిస్తోందే అంటూ చెప్పుకొస్తున్నారు. ఇక కెరీర్ విషయానికొస్తే అమీషా ప్రస్తుతం ‘దేశీ మ్యాజిక్’, ‘తుబా తేరా జల్వా’, ‘ది గ్రేట్ ఇండియన్ క్యాసినో’,’మిస్టరీ ఆఫ్ టాటూ’,’గదర్-2′ చిత్రాల్లో నటిస్తుంది. మరి ఈ సినిమాలు ఈ ముద్దుగుమ్మకు ఎలాంటి విజయాలను అందిస్తాయో చూడాలి.
