Ambajipeta Marriage Band Release Date Fixed: సుహాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” ఇప్పటికే షూట్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో మ్యారేజ్ బ్యాండ్ లీడర్ మల్లి క్యారెక్టర్ లో సుహాస్ కనిపించనున్నారు. “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమాను జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయాన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమాకు దుష్యంత్ కటికనేని దర్శకత్వం వహిస్తున్నారు.
Varanasi Airport : మహిళ మృతి అత్యవసరంగా ల్యాండ్ అయిన విమానం
కామెడీ డ్రామా కథతో తెరకెక్కుతున్న”అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమా రిలీజ్ డేట్ ను మంగళవారం నాడు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సినిమాను ఫిబ్రవరి 2న గ్రాండ్ గా థియేటర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. వైవిధ్యమైన, కథా కథనాలతో తెరకెక్కిన “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” మూవీ థియేటర్స్ లో ఆడియన్స్ కు యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని చిత్రబృందం ఆశిస్తున్నారు. సుహాస్, శివాని నాగరం హీరోహీరోయిన్లుగా నటిస్తున్న శరణ్య ప్రదీప్,జబర్దస్త్ ప్రతాప్ భండారి, గోపరాజు రమణ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు వాజిద్ బేగ్ సినిమాటోగ్రఫీ అందించారు. కోదాటి పవన్ కల్యాణ్ ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు అధికారిక ప్రకటన వచ్చేసింది.