Amani Shares her Casting Couch Experience: సీనియర్ నటి, ఒకటప్పటి హీరోయిన్ ఆమని సంప్రదాయమైన పాత్రలు చేస్తూ మంచి పేరు తెచ్చుకుంది.. అయితే అలాంటి ఆమెకు కూడా క్యాస్టింగ్ కౌచ్ తిప్పలు తప్పలేదని ఆమె వెల్లడించింది. ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో ఎదురైన లైంగిక వేధింపులను బయటపెట్టారు. తన కెరీర్ మొదట్లో చాలామంది ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ మాటలతో ఇబ్బంది పెట్టేవారని ఓ తమిళ దర్శకుడు అయితే ఏకంగా స్ట్రెచ్ మార్క్స్ మీకు ఉన్నాయా లేదో చూపించండి అని నేరుగా అడిగాడని అతనికి సమాధానం చెప్పలేక అక్కడ నుంచి లేచి వెళ్లిపోయానని ఆమని చెప్పారు. బాడీలో ఎవరికి చెప్పుకోలేని చోట్ల కూడా వారికి చూపించాలని ఇబ్బంది పెట్టిన దర్శకులు కూడా ఉన్నారని, ఆమె అన్నారు.
Priest Video: పురోహితుడిపై దారుణం.. తీవ్ర స్థాయిలో కోన వెంకట్, హరీష్ శంకర్ ఫైర్
అంతేకాక ఆమె మాట్లాడుతూ పెద్ద ప్రొడక్షన్ సినిమాల్లో నటీనటులతో చాలా బాగా ఉంటారు, అక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉండవు, కేవలం సినిమాకు సంబంధించిన ప్రశ్నలు మాత్రమే అడిగేవారు అని ఆమని చెప్పుకొచ్చారు. చిన్న సినిమాల విషయంలో ఈ వేధింపులు చోటు చేసుకుంటాయని పేర్కొన్నారు. ఈ విషయంలో జీవితంలో ఒక్కసారి లొంగితే అది ఒక్కరితో ఆగదని, నా జీవితంలో అలాంటి రోజు రానుందుకు చాలా ఆనందంగా ఉందని ఆమె పేర్కొన్నారు. హీరోయిన్లకు క్యాస్టింగ్ కౌచ్ సమస్యలు ఎప్పటినుంచో ఉన్నాయని అప్పట్లో ఎక్కువగా సోషల్ మీడియా లేదు కాబట్టి ఎవరికి తెలియకపోయేదని తెలిపింది. తాను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు చాలా మంది హీరోయిన్స్ ఉన్నారని, వాళ్లను దాటుకుని నా వరకూ ఛాన్స్ రావడం నిజంగా గొప్ప విషయమేనని చెప్పాలని అన్నారు.