Site icon NTV Telugu

Amala Paul: ఆ హీరోలతో చాలా ఇబ్బంది పడ్డాను.. అందుకే సినిమాలకు బ్రేక్..?

Amala

Amala

Amala Paul: చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన ప్రతి హీరోయిన్ చాలా కష్టాలను ఎదుర్కొన్నాకే ఒక స్టార్ స్టేటస్ ను అందుకొంటుంది. ఈ విషయం అందరికి తెల్సిందే. ఇక ఒక్కసారి సక్సెస్ అందుకున్నాకా ఆమె పడిన కష్టాలు మీడియా ముందు బయటపెడతారు. తాజాగా కోలీవుడ్ బ్యూటీ అమలా పాల్ తాను ఇండస్ట్రీలో పడిన బాధలను వివరించింది. ఇటీవలే కడవర్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్న ఈ భామ ఒక ఇంటర్వ్యూలో తన గతం తాలూకు చేదు జ్ఞాపకాలను మీడియాతో పంచుకొంది. ఒకానొక దశలో సినిమాలు మానేసే పరిస్థితి వచ్చిందంటూ ఎమోషనల్ అయ్యింది.

“కెరీర్ ప్రారంభంలో ఎన్నో కష్టాలు అనుభవించాను. ముఖ్యంగా పెద్ద హీరోలు, నాకన్నా వయసులో పెద్దవారైనా వారితో రొమాన్స్ చేసినప్పుడు ఎంతో ఇబ్బందిపడ్డాను. ఎంతో ఒత్తిడికి గురయ్యాను. సక్సెస్ కోసం ఇంతగా పాకులాడుతున్నానా అని అనిపించింది. కానీ, వారితో నటించడం వలన ఎన్నో నేర్చుకున్నాను. ఇక చాలా సార్లు నిజజీవితానికి దూరంగా బతుకుతున్నానా..? అని అనిపించేది. ఎంతో మదనపడ్డాను. చాలాసార్లు సినిమాలకు బ్రేక్ ఇవ్వాలనిపించింది. ఇక ఆ సమయంలోనే మా నాన్నగారు మృతి చెందాను. ఎన్నో బయలు నన్ను వెంటాడాయి. కానీ అన్నింటిని తట్టుకొని నిలబడ్డాను. పోరాడి ఇక్కడి వరకు వచ్చాను” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అమలా వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Exit mobile version