Site icon NTV Telugu

HHVM : ‘వీరమల్లు’ టికెట్ల రేట్ల పెంపు.. ఫిల్మ్ ఛాంబర్ కు ఏఎం రత్నం..

Am Ratnam

Am Ratnam

HHVM : పవన్ కల్యాణ్‌ నటించిన ‘హరిహర వీరమల్లు’ సినిమా జూన్ 12న రిలీజ్ కాబోతోంది. తన మూవీ టికెట్ రేట్లు పెంచడం కోసం అయినా సరే ఛాంబర్ ద్వారానే రావాలని ఇప్పటికే పవన్ తేల్చి చెప్పాడు. వ్యక్తిగత సంభాషణలు, పర్సనల్ విజ్ఞప్తులు ఉండొద్దని చెప్పేశాడు. కాబట్టి పవన్ సూచనలు పాటిస్తూ ఏఎం రత్నం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ను ఆశ్రయించాడు. హరిహర వీరమల్లు టికెట్ ధరల పెంపు, అదనపు షోల పర్మిషన్ కోసం ఏపీ ప్రభుత్వాన్ని సంప్రదించాలని ఛాంబర్ కు వినతి పత్రం అందజేశాడు.

Read Also : The Raajasaab : రాజాసాబ్ టీజర్ ఆగమనం.. రేపే అప్డేట్..?

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్ ను కలిసి లెటర్ అందజేశాడు. త్వరలోనే ఏపీ ప్రభుత్వానికి టికెట్ రేట్ల పెంపుకోసం అప్లై చేస్తామని భూషన్ చెప్పారు. ఇటు తెలంగాణలో టికెట్ రేట్ల పెంపుకోసం సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఏపీలో పవన్ డిప్యూటీ సీఎంగా ఉన్నా సరే తన సినిమాకు అందరి లాగే రూల్స్ ఉంటాయని రీసెంట్ గా చెప్పేశాడు. థియేటర్ల బంద్ అంశం తెరమీదకు వచ్చినప్పుడే పవన్ ఈ ప్రకటన చేశాడు. అప్పటి నుంచి తెలుగు సినిమాలు అన్నీ ఛాంబర్ ద్వారానే వెళ్లేందుకు రెడీ అవుతున్నాయి.

ఇక చాలా వాయిదాల తర్వాత పవన్ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. క్రిష్‌, జ్యోతికృష్ణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా హిస్టారిక్ నేపథ్యంలో వస్తోంది. ఇందులో పవన్ పోరాట యోధుడిగా కనిపించబోతున్నాడు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా చేస్తోంది. చాలా ఏళ్లు పెండింగ్ పడిన తర్వాత మూవీ ఎట్టకేలకు రిలీజ్ కాబోతోంది.

Read Also : Heroines : వయసు 45 ఏళ్లు దాటినా.. పెళ్లి వద్దంటున్న హీరోయిన్లు..

Exit mobile version