HHVM : పవన్ కల్యాణ్ నటించిన హరిహరీ వీరమల్లు సినిమా జూన్ 12న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ టికెట్ రేట్ల కోసం ఏఎం రత్నం ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. అయితే పవన్ కల్యాణ్ రీసెంట్ గా టాలీవుడ్ మీద ఫైర్ అయిన సంగతి తెలిసిందే. తన సినిమా అయినా సరే టికెట్ రేట్ల కోసం వ్యక్తిగతంగా రావొద్దని.. ఫిలిం ఛాంబర్ ద్వారానే అప్లై చేసుకోవాలని తేల్చి చెప్పేశారు. దీంతో ఇప్పుడు ఏఎం రత్నం ఫిలిం ఛాంబర్ ద్వారానే వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. వాస్తవానికి ఏపీలో టికెట్ల రేట్లకు సంబంధించి ఏది కావాలన్నా అందరూ పవన్ వద్దకు వెళ్లి కలిస్తే సరిపోయేది.
Read Also : GT vs MI: ఎలిమినేటర్ మ్యాచ్ రద్దైతే.. క్వాలిఫయర్ 2కు ఏ టీమ్ వెళుతుందంటే?
కానీ ఇప్పుడు పవన్ సినిమా నుంచే ఈ టికెట్ల రేట్ల విషయంలో ప్రాసెస్ మారిపోయింది. ఇది ఒక రకంగా ఏఎం రత్నంకు ఇబ్బందే అని చెప్పుకోవాలి. ఎందుకంటే స్వయంగా పవన్ సినిమా అయి ఉండి.. నేరుగా వెళ్లి ఓకే చేయించుకోలేని పరస్థితులు ఉన్నాయి. కానీ పవన్ చెప్పాడంటే దాన్ని ఫాలో కావాల్సిందే కదా.
అందుకే రత్నం ఇప్పుడు ఈ ప్రాసెస్ ను ఫాలో అవుతున్నారు. ఇటు తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డిని మరికొన్ని గంటల్లో కలుస్తారని తెలుస్తోంది. రేవంత్ రెడ్డిని కలిసి టికెట్ రేట్లను పెంచేందుకు విజ్ఞప్తి చేయబోతున్నాడంట. ఇందుకు సంబంధించిన విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వీరమల్లు సినిమా దాదాపు ఐదేళ్ల తర్వాత విడుదల కాబోతోంది. దానికి సంబంధించిన టికెట్ రేట్ల అంశం మరికొన్ని గంటల్లో క్లారిటీ రాబోతోంది.
Read Also : Murali Mohan : ఒకే సినిమాకు ఏపీ, తెలంగాణ అవార్డులు వద్దు.. మురళీ మోహన్ కామెంట్స్..
