Alluri: యంగ్ హీరో శ్రీ విష్ణుకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. తన సినిమా మీద ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్న ఈ హీరో అభిమానులను కూడా అంతే కాన్ఫిడెంట్ తో చూడమని చెప్పుకొచ్చాడు. శ్రీ విష్ణు హీరోగా ప్రదీప్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన అల్లూరి సినిమా నేడు రిలీజ్ అయ్యింది. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఈ సినిమా మార్కింగ్ షోలను రద్దు చేశారు. ప్రొడ్యూసర్ మరియు ఫైనాన్సియర్స్ కి మధ్య ఆర్థిక వివాదాలు జరగడం వలన ఈ సినిమా మార్నింగ్ షో పడలేదని టాక్ నడుస్తోంది. ఇక ప్రస్తుతం ఈ సమస్య తొలగిపోవడంతో సినిమా థియేటర్లో రిలీజ్ చేయడానికి ఫైనాన్సియర్స్ ఒప్పుకున్నారని అంటున్నారు. దీంతో అన్ని రాష్ట్రాల్లో మాట్నీ షోలు నడవనున్నాయని తెలుస్తోంది. ఇక ఈ విషయమై శ్రీ విష్ణు ట్వీట్ కూడా పెట్టాడు.
” కొన్ని కారణాల వలన మార్నింగ్ షో లు క్యాన్సిల్ అయ్యాయి. మ్యాట్నీస్ నుంచి మీదే. ఇక మీ చేతుల్లోనే.. మీ సమీప సినిమా హాళ్లలో ‘అల్లూరి’ చిత్రాన్ని ఆస్వాదించండి” అంటూ ట్వీట్ చేశాడు. ఇక షోలు రద్దు అవ్వడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మార్నింగ్ షోకు టిక్కెట్లు బుక్ చేసుకున్న వారి పరిస్థితి ఏంటని, వారికి కూడా ఆ టిక్కెట్స్ తో మరో షో చూపించాలని శ్రీ విష్ణును కోరుతున్నారు. ఇక హైదరాబాద్ లో అయితే ఈ సినిమా పాజిటివ్ టాక్ తోనే నడుస్తుందని చెప్పుకొస్తున్నారు. పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో శ్రీ విష్ణు నటన అద్భుతంగా ఉందని అంటున్నారు. మరి సినిమా ముగిసేలోపు టాక్ ఎలా ఉంటుందో చూడాలి.
Due to some issues, we couldn’t bring in the #Alluri morning shows!
Matinees nunchi meedhe .
Ika mi chethilone 🙏Enjoy #ALLURI at your nearest cinemas ❤️#AlluriFromToday pic.twitter.com/SnX5pdskcB
— Sree Vishnu (@sreevishnuoffl) September 23, 2022
