Site icon NTV Telugu

Allu Sirish: పెళ్లికి సిద్ధమైన అల్లు శిరీష్.. అమ్మాయి ఎవరంటే?

Shireesh

Shireesh

Allu Sirish : అల్లు ఫ్యామిలీలో అల్లు శిరీష్, తన సోదరుడు అల్లు అర్జున్ తరహాలోనే హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నాలు చేశాడు. ఎన్నో ప్రయత్నాలు చేసినా, ఒక్క సినిమా కూడా ఆయనకు హిట్ అందివ్వలేకపోయింది. ఇక, అల్లు శిరీష్ ఫలానా హీరోయిన్‌తో ప్రేమలో ఉన్నాడని, ఆమెతో వివాహం జరుగుతుందని గతంలో ఒకటి రెండు సార్లు ప్రచారం జరిగింది. అయితే, అది ప్రచారంగానే మిగిలిపోయింది. ఇప్పుడు అల్లు శిరీష్ నిజంగానే పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.

సదరు అమ్మాయి ఎవరో కాదు, హైదరాబాదులో ఒక బడా బిజినెస్‌మాన్ కుమార్తె అని తెలుస్తోంది. ఇప్పటికే రెండు ఇళ్లలోనూ మ్యాచ్ ఫిక్స్ అయింది. కానీ, ఈ మధ్యకాలంలోనే అల్లు కనకరత్నం మరణించడంతో అనౌన్స్‌మెంట్ వాయిదా పడింది. వీలైనంత త్వరలో అల్లు శిరీష్ తన వివాహానికి సంబంధించిన విషయాన్ని అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అల్లు శిరీష్ ముంబై వెళ్లి, అక్కడ సినీ ప్రయత్నాలు చేస్తున్నాడు. చివరిగా అల్లు శిరీష్ టెడ్డీ అనే సినిమాలో కనిపించాడు. అయితే, ఆ సినిమా మాత్రం ఆశించిన మేర ఫలితాన్ని అందుకోలేకపోయింది. ప్రస్తుతానికి శిరీష్ కథలు వింటున్నాడు, కానీ ఏ సినిమా ఇంకా ఫైనల్ చేయలేదు.

Exit mobile version