Allu Arjun: పాన్ ఇండియా స్టార్‌గా వరుస విజయాలతో దూసుకుపోతున్న అల్లు అర్జున్, ఇప్పుడు వ్యాపార రంగంలోనూ తన ఉనికిని మరింత బలోపేతం చేసుకుంటున్నారు. సినిమాలతో కోట్లాది అభిమానులను సంపాదించుకున్న ఆయన, దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలోనూ వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం ‘రాకా’పై అందరి దృష్టి ఉండగా, హైదరాబాద్‌లో ఆయన నిర్మిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్న కొత్త కార్పొరేట్ కార్యాలయం ఇప్పుడు మరో హాట్ టాపిక్‌గా మారింది. సినీ ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, అల్లు అర్జున్ హైదరాబాద్‌లో ‘ఐకాన్జా’ పేరుతో ఒక ప్రతిష్టాత్మక ఆఫీస్ స్పేస్‌ను నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. అభిమానులు ప్రేమగా పిలిచే ‘ఐకాన్ స్టార్’ అనే బిరుదు నుంచే ఈ పేరుకు ప్రేరణ లభించిందని చెబుతున్నారు. ‘ఐకాన్’ పదానికి తన పేరులోని అక్షరాలను జోడించి ‘ICONZAA’ అనే పేరును ఖరారు చేసినట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ డిజైన్, నిర్మాణానికి సంబంధించిన ప్రతి అంశాన్ని అల్లు అర్జున్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారని కూడా ప్రచారం సాగుతోంది.
ఈ ప్రాజెక్ట్ పూర్తయితే, ఇది హైదరాబాద్‌లో అల్లు అర్జున్‌కు చెందిన మరో ప్రధాన కార్పొరేట్ కేంద్రంగా నిలిచే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయన కుటుంబం జూబ్లీ హిల్స్‌లో “అల్లు ఎంటర్‌టైన్‌మెంట్” పేరుతో కార్యాలయాన్ని నిర్వహిస్తోంది. కొత్త ఆఫీస్ నిర్మాణం ద్వారా సినిమా నిర్మాణం, వ్యాపార కార్యకలాపాలను మరింత విస్తరించాలనే లక్ష్యంతో ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదిలా ఉంటే, అల్లు అర్జున్ ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత భారీ ప్రాజెక్టులలో ఒకటైన ‘రాకా’లో నటిస్తున్నారు. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దీపికా పడుకొణె కథానాయికగా నటిస్తున్నారు. అత్యాధునిక CGI, VFX సాంకేతికతతో రూపొందుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ నాలుగు విభిన్న పాత్రల్లో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఫస్ట్ లుక్ గ్లింప్స్‌లో ఆయన లుక్ ఇప్పటికే సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
‘రాకా’ తర్వాత అల్లు అర్జున్ దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో AA23 (LK07) పేరుతో మరో భారీ చిత్రాన్ని చేయనున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. కథానాయిక పాత్ర కోసం పూజా హెగ్డేతో చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే దర్శకుడు, నటుడు బాసిల్ జోసెఫ్‌తో కూడా మరో కొత్త ప్రాజెక్ట్‌కు అల్లు అర్జున్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. సినిమా రంగంలోనే కాకుండా రియల్ ఎస్టేట్ లో కూడా అల్లు అర్జున్ పెట్టుబడులు పెంచుకుంటున్నారనే ప్రచారం కొనసాగుతోంది. ఇప్పటికే జూబ్లీ హిల్స్‌లోని కొత్త ఇల్లు, అల్లు ఎంటర్‌టైన్‌మెంట్ కార్యాలయం, AAA సినిమాస్, అల్లు స్టూడియోస్ వంటి ఆస్తులతో ఆయన వ్యాపార విస్తరణకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు “ఐకాన్జా” కూడా అదే దిశలో మరో కీలక అడుగుగా మారే అవకాశముంది.

