Site icon NTV Telugu

Allu Arjun: బన్నీకి ఇప్పుడు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఎందుకబ్బా?

Allu Arjun At Rto

Allu Arjun At Rto

Allu Arjun visited Khairathabad RTO for obtaining international Driving Licence: అల్లు అర్జున్ ప్రస్తుతానికి పుష్ప సెకండ్ పార్ట్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పుష్ప ది రైజ్ అనే పేరుతో రిలీజ్ అయిన మొదటి భాగం సూపర్ హిట్ గా నిలవడమే కాదు ఆయనకు బాలీవుడ్ లో కూడా మంచి మార్కెట్ తీసుకువచ్చింది. నిజానికి పుష్ప రెండో భాగాన్ని వీలైనంత త్వరగా షూట్ చేసి రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ అల్లు అర్జున్ కి పెరిగిన మార్కెట్ సౌత్ సినిమాలకి నార్త్ లో ఏర్పడిన క్రేజ్ దృష్టిలో పెట్టుకొని అనేక మార్పులు చేర్పులు చేశారు. ఈ నేపథ్యంలోనే చాలా జాగ్రత్తగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ సుకుమార్. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే తాజాగా అల్లు అర్జున్ ఖైరతాబాద్ ఆర్టీవో కార్యాలయంలో మెరిశాడు.

Shiva Raj Kumar: RC16లో శివ రాజ్ కుమార్.. మైండ్ బ్లాక్ అవడం ఖాయం?

అయితే ఆయన ఏదైనా కొత్త కారు కొనుకున్నాడు ఏమో అందువల్ల నెంబర్ రిజిస్ట్రేషన్ కోసం వచ్చారేమో అనుకుంటే ఆయన ఆసక్తికరంగా ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం వచ్చినట్లు తెలిసింది. సాధారణంగా ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ చాలా తక్కువ మంది మాత్రమే తీసుకుంటూ ఉంటారు. ఇండియాలో పుట్టి ఇతర దేశాలలో బతకడానికి వెళ్లే వారితో పాటు ఇక్కడి నుంచి వెహికల్స్ వేసుకుని ఏదైనా రోడ్డు ట్రిప్స్ వాళ్ళు మాత్రమే తీసుకుంటూ ఉంటారు. అలాంటిది అల్లు అర్జున్ ఇప్పుడు తీసుకోవడం హాట్ టాపిక్ అవుతోంది. బహుశా విదేశాలలో ఏదైనా డ్రైవింగ్ సీక్వెన్స్ షూట్ చేయడానికి సుకుమార్ ప్లాన్ చేసి ఉండవచ్చని అంటున్నారు. ఎందుకంటే జపాన్ లో అల్లు అర్జున్ పుష్పా 2 షూటింగ్ చేయబోతున్నారని కొన్నాళ్ల క్రితం ప్రచారం జరిగింది. బహుశా ఇప్పుడు దాని కోసమే ఈ డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసి ఉండవచ్చని భావిస్తున్నారు. చూడాలి మరి అది ఎంతవరకు నిజమనేది

Exit mobile version