Site icon NTV Telugu

Allu Arjun : ‘ముంబై’లో బన్నీ సెటిల్మెంట్ వెనుక అసలు నిజమిదే

Raaka, Allu Arjun

Raaka, Allu Arjun

అల్లు అర్జున్ ముంబైలో సెటిల్ అయిపోతున్నారా? గత కొద్ది రోజులుగా ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో ఇదే హాట్ టాపిక్. అయితే, ఈ వార్తల్లో సగం మాత్రమే నిజమని, బన్నీ ముంబై వెళ్లడం వెనుక ఒక బలమైన ప్లాన్ ఉందని తెలుస్తోంది. అల్లు అర్జున్ ప్రస్తుతం కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీతో కలిసి చేస్తున్న ‘రాకా’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు సంబంధించిన మేజర్ పార్ట్ షూటింగ్ ముంబైలోని ఒక ప్రముఖ స్టూడియోలో వేసిన భారీ సెట్స్‌లో జరుగుతోంది. ప్రస్తుతం సినిమా కీలకమైన షెడ్యూల్‌లో ఉంది.

Also Read :Gayapadda Simham Exclusive: హ్యాపెనింగ్ హీరో ఎక్స్టెండెడ్ క్యామియో.. మరో సర్ప్రైజ్ కూడా!

షూటింగ్ కోసం ప్రతిరోజూ హైదరాబాద్ నుంచి ముంబైకి రాకపోకలు సాగించడం వల్ల సమయం వృధా అవ్వడమే కాకుండా, పనిపై ఏకాగ్రత దెబ్బతింటుందని బన్నీ భావించారు. అందుకే, ఈ మేజర్ షెడ్యూల్ పూర్తయ్యే వరకు ముంబైలోనే ఉండి సినిమాను త్వరగా పూర్తి చేయాలని ఆయన డిసైడ్ అయ్యారు. ఇది కేవలం ప్రొఫెషనల్ నిర్ణయం మాత్రమే తప్ప, అక్కడ శాశ్వతంగా సెటిల్ అయ్యే ఉద్దేశ్యం కాదని సన్నిహిత వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అట్లీ మార్క్ యాక్షన్, బన్నీ మార్క్ స్టైల్ కలగలిసి వస్తున్న ‘రాకా’ సినిమాపై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. షూటింగ్ వేగవంతం అవ్వడంతో త్వరలోనే మరిన్ని అప్‌డేట్స్ వచ్చే అవకాశం ఉంది!

Exit mobile version