Site icon NTV Telugu

Allu Arjun: బింబిసార చిత్రబృందంపై ప్రశంసల వర్షం

Allu Arjun On Bimbisara

Allu Arjun On Bimbisara

Allu Arjun heaps praises on Bimbisara Team: ఈనెల 5వ తేదీన విడుదలైన ‘బింబిసార’ సినిమా విజయవంతంగా దూసుకెళ్తోంది. కళ్యాణ్ రామ్, కొత్త దర్శకుడు వశిష్ట్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం.. మంచి వసూళ్లు కొల్లగొడుతూ, టాలీవుడ్ బాక్సాఫీస్‌కి ఊపిరి పోసింది. ఈ నేపథ్యంలోనే బింబిసార చిత్రబృందంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. సినీ అభిమానుల దగ్గర నుంచి ప్రముఖులు దాకా.. ప్రతిఒక్కరూ ఈ చిత్రాన్ని, కళ్యాణ్ రామ్‌, దర్శకుడు వశిష్ట్‌ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. తాజాగా ఈ బాబితాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా చేరిపోయాడు. రీసెంట్‌గా ఈ సినిమా చూసిన బన్నీ, సినిమా హిట్ అయినందుకు యూనిట్‌ని అభినందనలు తెలిపాడు. కొత్త ట్యాలెంట్‌ని ప్రోత్సాహిస్తోన్న కళ్యాణ్‌ని తానెంతో గౌరవిస్తానని పేర్కొన్నాడు.

‘‘బింబిసార చిత్రబృందానికి శుభాభినందనలు. ఇదొక ఆసక్తికరమైన, ఆకర్షణీయమైన ఫ్యాంటసీ సినిమా. కళ్యాణ్ రామ్ నటన ప్రభావితం చేసేలా ఉంది. ఎల్లప్పుడూ కొత్త తరహా కథల్ని అటెంప్ట్ చేయడంతో పాటు కొత్త ట్యాలెంట్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తోన్న కళ్యాణ్ రామ్ అంటే నాకెంతో గౌరవం. తొలి ప్రయత్నంలో ఇంత గొప్ప చిత్రాన్ని హ్యాండిల్ చేసిన దర్శకుడు వశిష్ట్ పనితనాన్ని మెచ్చుకోవాల్సిందే. ఈ సినిమాకి పని చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు నా హృదయపూర్వక శభాభినందనలు. బింబిసార.. అన్ని వయసుల వారు చూసి, ఎంజాయ్ చేయగలిగే సినిమా’’ అంటూ బన్నీ ట్వీట్ చేశాడు. దీంతో, నందమూరి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒక స్టార్ హీరో తమ అభిమాన హీరో చిత్రానికి ఇలా మద్దతు తెలపడంతో, ఆ ట్వీట్లను షేర్ చేస్తూ, నెట్టింట్లో వైరల్ చేస్తున్నారు.

కాగా.. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో రూపొందిన ‘బింబిసార’ సినిమాలో కళ్యాణ్ రామ్ త్రిగర్తల సామ్రాజ్యాధినేతగా నటించారు. రాజ్యాధికార కాంక్షతో ఎంతోమందిని బలితీసుకున్న రాజు.. టైమ్ ట్రావెల్ చేసి, ప్రస్తుత లోకంలో వచ్చి, తాను చేసిన తప్పుల్ని తెలుసుకొని, వాటిని సరిదిద్దుకునే అంశాలతో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో సంయుక్తా మీనన్, కేథరీన్ తెరిసాలు హీరోయిన్లుగా నటించారు.

Exit mobile version