నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఎంటర్‌టైన్‌మెంట్‌కి కేరాఫ్‌గా.. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఆడియెన్స్ ని అలరిస్తోంది. ఇప్పటికే రష్మిక నుంచి ఈ ఏడాది నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. తాజాగా ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ నెల 7న థియేటర్లోకి రాబోతుంది. ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు క్రియోట్ అవ్వగా తాజాగా నిర్మాత అల్లు అరవింద్ ఈ మూవీ పై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి..
Also Read: Rashi khanna : అలాంటి పాత్రలో నటించడం చాలా కష్టం..
ప్రఖ్యాత నిర్మాత అల్లు అరవింద్ తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్స్ అందించాడో మనకు తెలిసిందే. ఆయన ప్రొడ్యూస్ చేసిన సినిమాలు వాణిజ్యంగా మాత్రమే కాకుండా భావోద్వేగపూర్వకంగా కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అయితే ఇటీవల అల్లు అరవింద్ తన మనసులోని నిజమైన భావాన్ని బయటపెట్టారు. “నేను ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు తీసి కోట్లు సంపాదించాను. కానీ ఈసారి చేసిన ‘గర్ల్ ఫ్రెండ్’ సినిమా నాకు సంతృప్తిని ఇచ్చింది,” అంటూ ఆయన చెప్పారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ – “సినిమా అంటే కేవలం డబ్బు సంపాదించే సాధనం మాత్రమే కాదు. ప్రేక్షకుల మనసులను తాకే భావోద్వేగాల మాధ్యమం కూడా. ‘గర్ల్ ఫ్రెండ్’ సినిమా అచ్చం అలాంటి ఒక హృదయాన్ని హత్తుకునే కథ. ఇందులో ఉన్న నిజమైన భావాలు, యువతలో కనిపించే భావోద్వేగాల మేళవింపు ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టాయి. నేను ఈ చిత్రాన్ని నిర్మాతగా కాకుండా ప్రేక్షకుడిగా చూసినప్పుడు నిజంగా గర్వంగా అనిపించింది” అన్నారు. అలాగే, “ఇప్పటి ట్రెండ్‌లో ఎక్కువగా బిజినెస్ కోణం దృష్టిలో పెట్టుకుని సినిమాలు తయారవుతున్నాయి. కానీ ఈ సినిమా మాత్రం ఆ మార్గం కాకుండా నిజమైన కథనానికి ప్రాధాన్యత ఇచ్చింది. అందుకే దీని పట్ల నాకు ఎంతో గౌరవం ఉంది. ఇలాంటి సినిమాలు తరచూ రావాలి” అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
