NTV Telugu Site icon

Jailer: ‘సూపర్ స్టార్’ తుఫాన్ కి సిద్ధమైన చెన్నై…

Jailer

Jailer

సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జైలర్’ మరో రెండు వారాల్లో ఆడియన్స్ ముందుకి రానుంది. తలైవర్ నుంచి సినిమా వస్తుంది అంటే కోలీవుడ్ నుంచి అమెరికా వరకూ అన్ని సెంటర్స్ లో హంగామా ఉంటుంది. రిలీజ్ కి వారం ముందు నుంచే ఫెస్టివల్ వైబ్స్ ఇస్తూ రజినీకాంత్ థియేటర్స్ లోకి వస్తాడు. గవర్నమెంట్స్ కూడా సెలవలు ప్రకటించే రేంజ్ హడావుడితో రజినీ థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చే వాడు. అలాంటిది జైలర్ సినిమా మాత్రం చాలా తక్కువ సౌండ్ చేస్తోంది. సందడి లేదు, సంబరాలు లేవు చడీ చప్పుడు లేకుండా ప్రమోషన్స్ జరుపుకుంటూ ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీ అయ్యింది జైలర్. రజినీ కెరీర్ లోనే ఇంత లో ఫేజ్ ని చూడడం ఇదే మొదటిసారి అనిపించే అంత వీక్ గా ప్రమోషన్స్ సాగుతున్నాయి. అనిరుద్ ఇచ్చిన సాంగ్స్ ట్రెండ్ అవుతున్నాయి కానీ హైప్ మాత్రం పెరగట్లేదు.

ట్రైలర్ బయటకి వస్తే కానీ బజ్ కనపడేలా లేదని కొందరు ట్వీట్స్ చేస్తుంటే… మే హూ నా అంటూ లైన్ లోకి వచ్చేసింది ఆడియో లాంచ్. రజినీకాంత్ స్పీచ్ లకి, ఆయన ఆఫ్ లైన్ ఫొటోస్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆ ఫ్యాన్స్ ని ఖుషి చేయడానికే గ్రాండ్ ఆడియో లాంచ్ కి రంగం సిద్ధమయ్యింది. ఈరోజు సాయంత్రం జైలర్ ఆడియో లాంచ్ జరగనుంది. ఈ ఈవెంట్ తో జైలర్ సినిమాపై అంచనాలు పెరగడం గ్యారెంటీ. ఆ అంచనాలని ట్రైలర్ రిలీజ్ తో మరింత పెంచితే చాలు రజినీ సినిమా రిలీజ్ హంగామా స్టార్ట్ అయిపోతుంది. ఆ హైప్ కి తగ్గట్లు జైలర్ సినిమా కాస్త పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే చాలు బాక్సాఫీస్ రికార్డులు గల్లంతవ్వడం ఖాయం.

Show comments