NTV Telugu Site icon

Dhanush: జులై 28 ధనుష్ సోషల్ మీడియాని కబ్జా చేయనున్నాడు…

Dhanush

Dhanush

ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఉన్న వారిలో మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ ఎవరు అనే లిస్టు తీస్తే అందులో తప్పకుండా వినిపించే టాప్ టెన్ పేర్లలో ధనుష్ పేరు తప్పకుండా ఉంటుంది. వీడు హీరో ఏంట్రా అనే దగ్గర నుంచి హీరో అంటే వీడేరా అని ప్రతి ఒక్కరితో అనిపించుకునే వరకు వచ్చిన ధనుష్, పాన్ ఇండియా రేంజ్ సినిమాలని అన్ని భాషల్లో చేస్తున్నాడు. హిందీలో, తెలుగులో స్ట్రెయిట్ సినిమాలని చేస్తూ హిట్స్ కొడుతున్న ధనుష్ జులై 28న సోషల్ మీడియాని కబ్జా చేయబోతున్నాడు. రీసెంట్ గా సార్ సినిమాతో తెలుగు, తమిళ భాషల్లో హిట్ కొట్టిన ధనుష్ నుంచి జులై 28న ఎలాంటి అప్డేట్స్ వస్తాయని ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. జులై 28న ధనుష్ బర్త్ డే కాబట్టి ఆ రోజు తప్పకుండా సర్ప్రైజ్ న్యూస్ లు బయటకి వస్తాయి.

ధనుష్ పుట్టిన రోజున బయటకి రానున్న వార్తల్లో మొదటిది ‘కెప్టెన్ మిల్లర్’ సినిమా టీజర్. పాన్ ఇండియా రేంజులో భారీ బడ్జట్ తో రూపొందుతున్న ఈ మూవీ మేకింగ్ వీడియో, ఫస్ట్ లుక్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక టీజర్ కూడా బయటకి వస్తే కెప్టెన్ మిల్లర్ పై అంచనాలు ఆకాశాన్ని తాకడం గ్యారెంటీ. ధనుష్ 50గా సెట్స్ పైకి వెళ్లిన లేటెస్ట్ మూవీని ధనుష్ స్వయంగా డైరెక్ట్ కూడా చేస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ కూడా జులై 28నే బయటకి రానుంది. ఈ రెండు సినిమాలతో పాటు ధనుష్ నటిస్తున్న హిందీ సినిమా అప్డేట్ కూడా అనౌన్స్ అవ్వనుంది. ఆనంద్ ఎల్ రాయ్ డైరెక్షన్ లో ధనుష్ ఇప్పటికే రెండు సినిమాలు చేసాడు. లేటెస్ట్ గా హ్యాట్రిక్ కోసం మళ్లీ కోలాబ్ అయిన ఈ హీరో-డైరెక్టర్ ‘తేరే ఇష్క్ మెయిన్’ అనే సినిమా చేస్తున్నారు. జులై 27 రాత్రే ఈ మూవీ నుంచి అప్డేట్ బయటకి వస్తుందని సమాచారం. మూడు సినిమాల అప్డేట్ ఒకే రోజున బయటకి వస్తే ధనుష్ ఫాన్స్ సోషల్ మీడియాలో ఏ రేంజ్ హంగామా చేస్తారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.