NTV Telugu Site icon

Devara: అందరి ఎదురు చూపులు ఆ ఒక్క విషయం మీదే?

Devara First Single Update

Devara First Single Update

Devara First Single: పుష్ప -2 ఫస్ట్ సింగిల్ పై మార్కెట్ లో గట్టిగానే డిస్కషన్ నడుస్తుంది. దీంతో మే20న రిలీజయ్యే దేవర ఫస్ట్ సింగిల్ రిసీవింగ్ ఎలా ఉంటుందా అనే ముచ్చట… మార్కెట్లో సీరియస్ గా నడుస్తుంది. ప్రెస్టీజియస్ ఫిలింస్ నుంచి వచ్చే చిన్న చిన్న అప్ డేట్స్ సినిమా బజ్ పై సీరియస్ ఇంపాక్ట్ చూపిస్తున్నాయి.పుష్ప 2 విషయంలో సరిగ్గా జరిగింది ఇదే. టీజర్ ,లిరికల్ సాంగ్ ట్రెండింగ్లో నిలిచినప్పటికీ కొన్ని భాషల్లో బజ్ క్రియేట్ చేయలేకపోయింది.ఎప్పుడూ ఒకే రకమైన రిసీవింగ్ ఏ క్రేజీ ఫిలింకు ఉండదనే విషయం పుష్ప 2 తో మరోసారి ప్రూవ్ అయ్యింది.ఇప్పుడు ఇదే భయం దేవరను వెంటాడుతుంది.

Satyadev: విజయవాడ అంటే పాలిటిక్స్, రౌడీయిజం కాదు అని చెప్పే కథే ‘కృష్ణమ్మ’: సత్యదేవ్ ఇంటర్వ్యూ

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ , జాన్వీ కపూర్ లతో దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “దేవర” . హాలీవుడ్ లెవెల్ హంగులతో ఈ పిక్చర్ ని తెరకెక్కిస్తున్నారు. ఐతే ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తుండడంతో అందరి చూపు దేవర పై పడింది.ఆల్రెడీ అనిరుద్ మ్యూజిక్ పై ఇప్పటికే భారీ హైప్ ఫామ్ అయింది. మే నెలలోకి ప్రాజెక్ట్ అడుగు పెట్టడంతోనే తారక్ ఫ్యాన్స్ లో సినిమా ఫస్ట్ సింగిల్ ఎలా ఉంటుందా అనే ఆసక్తి రేకెత్తిస్తోంది.మే20న తారక్ బర్త్ డే కావడంతో ఆ రోజు వచ్చే ఫస్ట్ సింగిల్ నందమూరి అభిమానులను డిస్టర్బ్ చేసే స్థాయిలో ఉంటుందా ఉండదా అనే చర్చ అయితే జరుగుతుంది.ఎందుకంటే ఇక్కడ అనిరుద్ మ్యూజిక్ కావడంతో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.వేరే సంగీత దర్శకుడైతే ఈ లెక్క ఉండేది కాదు.

గత కొన్నాళ్లుగా దేవర ఫస్ట్ సింగిల్ అంటూ ఓ హాష్ ట్యాగ్ అప్పుడప్పుడూ ట్రెండ్ అవుతుంది. దీంతో దేవర సాంగ్ కోసం ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.పుష్ప 2 ఫస్ట్ సింగిల్ మాదిరిగా ఒక భాషలో బజ్ క్రియేట్ చేసి మరొక భాషలో బజ్ క్రియేట్ చేయలేకపోతే చాలా ఈక్వేషన్స్ చేంజ్ అవుతాయి. అంతే కాదు సినిమా బిజినెస్ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని కొరటాల చాలా ప్లానింగ్ తో దేవరను తయారుచేస్తున్నారని టాక్.

Show comments