Site icon NTV Telugu

Alia Bhatt: కూలెస్ట్ మమ్మీ ఇన్ టౌన్

Alia Bhatt Coolest Mom

Alia Bhatt Coolest Mom

Alia Bhatt: బాలీవుడ్ యంగ్ హీరోయిన్స్‌లో అలియా భట్‌కి ఉన్న క్రేజ్ ఎవరికీ లేదు. గ్లామర్‌తో పాటు యాక్టింగ్ టాలెంట్ కూడా పుష్కలంగా ఉన్న ఈ బ్యూటీ ‘హైవే’, ‘ఉడ్తా పంజాబ్’, ‘రాజీ’, ‘గల్లీ బాయ్’ సినిమాలతో మంచి యాక్టర్‌గా ప్రూవ్ చేసుకుంది. గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్న అలియా భట్‌కి 2022 చాలా స్పెషల్‌గా నిలుస్తోంది. గంగుభాయ్ కతియావాడి, ఆర్ఆర్ఆర్, బ్రహ్మాస్త్ర పార్ట్ 1 సినిమాలతో అలియా భట్ 2022ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. ఒక్క ఏడాదిలో మూడు బ్లాక్ బస్టర్ హిట్స్‌లో భాగం కావడం అలియా భట్ అదృష్టమనే చెప్పాలి. సినిమాల పరంగానే కాకుండా 2022 అలియా భట్ పర్సనల్ లైఫ్‌లో కూడా చాలా చేంజస్ వచ్చాయి. 14 ఏప్రిల్ 2022న బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న అలియా భట్, నవంబర్ 6న ఒక పాపాకి జన్మనిచ్చింది.

పెళ్లైన ఏడు నెలల్లో అలియా భట్ ఒక బిడ్డకి జన్మనివ్వడంతో, ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. తను ప్రెగ్నెంట్‌గా ఉన్న టైంలో కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అలియా భట్, రీసెంట్‌గా ఎల్లో టాప్ బ్లూ డెనిమ్‌లో ఉన్న ఫొటోలు నెట్టింట్లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోల్లో అలియా భట్‌ని చూసిన వాళ్ళు, ‘ది కూలెస్ట్ మమ్మీ ఇన్ టౌన్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిజంగానే ఈ ఫోటోలు చూస్తే అలియా భట్‌కి పెళ్లై ఒక పాపా కూడా ఉంది అంటే ఎవరూ నమ్మరు, అంత క్యూట్‌గా ఉంది. ఇక సినిమాల విషయానికి వస్తే.. 2023ని అలియా భట్ ‘రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ’ సినిమాతో మొదలు పెట్టనుంది. రణవీర్ సింగ్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ 2023 ఏప్రిల్ 28న ఆడియన్స్ ముందుకి రానుంది.

Exit mobile version