“NTR30″ని కన్ఫర్మ్ చేసిన బాలీవుడ్ భామ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొన్ని రోజులుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త చిత్రం ‘ఎన్టీఆర్ 30’ గురించి సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఈ ఎన్టీఆర్ తో జత కట్టబోయే హీరోయిన్ గురించి. అందులోనూ ఓ బాలీవుడ్ భామ పేరు ఎక్కువగా విన్పించింది. అయితే ఇప్పుడు ఆమె స్వయంగా ‘ఎన్టీఆర్ 30’లో తానే హీరోయిన్ అని కన్ఫర్మ్ చేసింది. దీంతో నందమూరి అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు.
Read Also : డాక్టర్ రాజశేఖర్ షష్టి పూర్తి!
Also Read
- Sankranti 2027: అనిల్ రావిపూడికి ఈసారి టఫ్ ఫైట్.. 2027 సంక్రాంతి బరిలో బిగ్ వార్!
- Toxic Makers: ‘ధురంధర్ 2’కు షాకిచ్చిన ‘టాక్సిక్’.. ఫ్యాన్స్‌కు మేకర్స్ కీలక విజ్ఞప్తి
- Shiraz Mehdi: దిల్ రాజు సహా ఫిల్మ్ ఛాంబర్‌కు దర్శకుడు లీగల్ నోటీసులు, సీఎం రేవంత్ కు ఫిర్యాదు!
- NBK111: స్పీడ్ పెంచిన బాలయ్య .. శుక్రవారం డబ్బింగ్, అక్టోబర్ 5న కొత్త షెడ్యూల్!
అసలు విషయంలోకి వస్తే… నిన్న ముంబైలో జరిగిన అలియా భట్ ‘గంగూబాయి కతియావాడి’ ప్రత్యేక ట్రైలర్ స్క్రీనింగ్ లో ‘ఎన్టీఆర్ 30’ గురించి ఓపెన్ అయ్యింది అలియా. ట్రైలర్ ప్రీమియర్ ఈవెంట్ Q&A సెషన్‌లో అలియా భట్ కు ఆమె భవిష్యత్తు ప్రాజెక్ట్‌ల గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. అందులో ‘ఎన్టీఆర్ 30’ గురించి కూడా ఆమెను ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు అలియా బదులిస్తూ “ఆర్ఆర్ఆర్ విడుదల కావాల్సి ఉంది. నేను ఇంకా వ్యాఖ్యానించకూడని మరో ప్రాజెక్ట్ ఉంది” అంటూనే “కొరటాల శివ చాలా క్లారిటీ ఉన్న ఫిల్మ్ మేకర్. చిరంజీవి, రామ్ చరణ్ లతో శివ సినిమా ‘ఆచార్య’ విడుదల కోసం ఎదురు చూస్తున్నాను. జూనియర్ ఎన్టీఆర్ విషయానికొస్తే అతనితో పని చేయడం చాలా సౌకర్యంగా ఉంది. ఆయన ఒక స్వీట్ హార్ట్. కొరటాల శివ వచ్చి కథ చెప్పాడు. ఆయన కథనం పూర్తి చేసిన వెంటనే నేను బోర్డులోకి రావడానికి అంగీకరించాను. నేను ఈ ప్రాజెక్ట్ లో పని చేయడానికి ఎదురు చూస్తున్నాను” ఎఅంటూ చెప్పుకొచ్చింది.
నందమూరి కళ్యాణ్ రామ్‌తో కలిసి సుధాకర్ మిక్కిలినేని నిర్మిస్తున్న ‘ఎన్టీఆర్ 30’ పాన్-ఇండియా స్థాయిలో రూపొందుతున్న గ్రామీణ యాక్షన్ ఎంటర్‌టైనర్. ఫిబ్రవరి 7న హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రారంభం కానుంది. మరోవైపు అలియా భట్ సంజయ్ లీలా భన్సాలీ “గంగూబాయి కతియావాడి” ఫిబ్రవరి 25న విడుదల కానుంది.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..