Kalki2898AD : కల్కి – 2 లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్

Kalki

Kalki

బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సృష్టించిన ‘కల్కి 2898 AD’ సీక్వెల్‌కు సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ఈ సీక్వెల్‌లో భాగం కానున్నట్లు తెలుస్తోంది. కానీ ఆమె పాత్ర విషయంలో మాత్రం ట్విస్ట్ ఇచ్చేలా ఉంది ఈ న్యూస్. గతంలో ప్రచారం జరిగినట్లుగా ఆలియా సినిమాలో ‘సుమతి’ పాత్రను పోషించడం లేదట. నిజానికి కల్కి మొదటి భాగంలో దీపికా పదుకొనె పోషించిన సుమతి పాత్ర కీలకంగా ఉంటుంది. కానీ వర్కింగ్ అవర్స్, రెమ్యునరేషన్ వంటి కారణాలతో దీపికా ఈ సీక్వెల్ ను వైదొలిగింది.

ఈ నేపథ్యంలో దీపిక పోషించిన ‘సుమతి’ పాత్రలో ఎవరు నటిస్తారనే విషయంపై గత కొద్దిరోజులుగా అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ‘కల్కి 2’ బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ జాయిన్ అయినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. కానీ ఆమెది సుమతి రోల్  కాదు. సినిమాలో కీలకంగా వచ్చే ఓ స్పెషల్ రోల్‌లో కనిపించబోతున్నట్లు సినీ వర్గాల సమాచారం. అంతేకాదు ఆలియా భట్ ఇప్పటికే తన పాత్రకు సంబంధించిన కొంతమేర షూటింగ్‌ను కూడా పూర్తి చేసేసిందట. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయిన ఆలియా ఈ విజువల్ వండర్‌లో నటిస్తే సినిమాకు మరింత మైలేజ్ రావడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక దీపిక ప్లేస్‌లో  స్టార్ క్వీన్ సాయి పల్లవి నటిస్తోంది. త్వరలోనే ఆలియా భట్‌తో పాటు సాయి పల్లవి ఆన్ బోర్డ్ పై అధికారక ప్రకటన చేసే అవకాశం ఉంది.

×
×
Ad