Alia Bhatt: బాలీవుడ్ కు ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తుందనే చెప్పాలి. ఈ ఏడాది స్టార్ హీరోలు సైతం ప్రేక్షకులను మెప్పించలేకపోయారు. ఇక మరోపక్క సౌత్ ప్రేక్షకుల ఆగ్రహానికి గురికావడంతో బాయ్ కాట్ బాలీవుడ్ ట్రెండ్ నడుస్తోంది. ఇక ఇన్ని చేదు వార్తల మధ్యలో బాలీవుడ్ ఒక మంచి న్యూస్ విన్నట్లు అనిపిస్తోంది. అదేంటంటే.. అలియా భట్ నటించిన గంగూభాయ్ కతీయవాడి సినిమా ఆస్కార్స్ కు ఎంపిక అయ్యినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సంజయ్ లీల భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ ఏడాది రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకొంది. ఇందులో వైశ్యా వాటిక లీడర్ గా అలియా నటనకు యావత్తు సినీ లోకం నీరాజనం పట్టింది. ఒక హీరోయిన్ నటించిన సినిమా వంద కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యింది.
అలియా భట్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తో పాటు అరుదైన ఎన్నో రికార్డులను ఈ సినిమా కైవసం చేసుకొంది. ఇక ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియదు కానీ.. ఒకవేళ ఆస్కార్స్ లో కనుక ఈ సినిమా ఉంటే అలియా నటనకు, పాత్రకు సరైన గౌరవం అందినట్లే అని బాలీవుడ్ అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఒక వైశ్య ఎంతో పోరాడి స్వేచ్ఛను తీసుకొచ్చి తనలాంటి వారిని ఉన్నతంగా జీవించడానికి బాటలు వేసిన కథ ఎంతోమందిని కలిచివేసింది. ఇక ఈ సినిమా విదేశాల్లో కూడా మంచి పాపులారిటీని కూడా సంపాదించుకొంది. మరి ఏ కేటగిరిలో ఈ చిత్రం ఉండబోతుందో చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే..
