Site icon NTV Telugu

“అల వైకుంఠపురంలో” హిందీ రీమేక్ టైటిల్ ఇదే?

'Ala Vaikunthapurramuloo' Hindi remake title fix ?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ “అల వైకుంఠపురంలో”. 2020 సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. టాలీవుడ్ లో కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో బాలీవుడ్ యంగ్ స్టార్స్ కార్తీక్ ఆర్యన్, కృతి సనోన్ హీరోహీరోయిన్ల పాత్రలు పోషించనున్నారు. తెలుగులో మురళీశర్మ పోషించిన పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు పరేష్ రావల్ కనిపించనున్నారు. ఇందులో మురళీశర్మ హీరో తండ్రిగా నటించిన తీరుకు ప్రశంసలు కురిశాయి.

Read Also : “సిగ్గు ఎందుకురా మామ” అంటున్న సుకుమార్

టబు పాత్రలో మనీషా కొయిరాలా నటిస్తున్నట్లు చెబుతున్నారు. రోహిత్ ధావన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఏక్తా కపూర్, అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మించనున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం టైటిల్ ఖరారైనట్లు తెలుస్తోంది. “షెహజాదా” అనే టైటిల్ మేకర్స్ ఫిక్స్ చేశారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Exit mobile version