NTV Telugu Site icon

అక్షయ్ దాతృత్వం… 3600 మంది డ్యాన్సర్లకు కడుపు నిండా భోజనం!

అక్షయ్ కుమార్ అనగానే ఒకప్పుడు డేర్ డేవిల్ స్టంట్స్ గుర్తుకు వచ్చేవి. అందుకే, అతడ్ని ఫ్యాన్స్ ఖిలాడీ అంటుంటారు. తరువాత నటనలో ప్రతిభ పెంచుకుని కామెడీ నుంచీ ఎమోషనల్ క్యారెక్టర్స్ దాకా అన్ని రకాల పాత్రల్నీ పోషించాడు. ‘సింగ్ ఈజ్ కింగ్’ అనిపించుకున్నాడు. ఇక ఈ మధ్య కాలంలో అక్షయ్ తన దానధర్మాలతో వార్తల్లో నిలుస్తున్నాడు. ముఖ్యంగా ఆర్మీకి ఎటువంటి నష్టం కలిగినా, లేదా దేశానికి ఏదైనా విపత్తు సంభవించినా ఆయన కోట్లలో విరాళాలు ఇస్తూ ఉంటూ ఉంటాడు. పోయిన సంవత్సరం కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో భారీగా విరాళం ప్రకటించాడు.
2021లో ఇప్పుడు మళ్లీ విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి నేపథ్యంలో అక్షయ్ మరొకసారి తన దాతృత్వం చాటుకున్నాడు. సినీ పరిశ్రమలోని సీనియర్ కొరియోగ్రాఫర్స్ లో ఒకరైనా గణేశ్ ఆచార్య నడుపుతోన్న ట్రస్ట్ కు ఆర్దిక సాయం చేస్తున్నాడు. మొత్తం 3600 మంది డ్యాన్సర్స్ కి నెలవారి సరుకులు ఉచితంగా ఇవ్వనున్నారు. ఇందులో 1600 మంది జూనియర్ కొరియోగ్రాఫర్స్ లేదా వయసు పైబడిన డ్యాన్సర్స్ ఉంటారట. ఇక మరో రెండు వేల మంది బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్స్ ఉంటారట. మొత్తం 3600 మందికి వారు అడిగిన విధంగా నెలవారి సరుకులుగానీ, అందుకు సరిపడా డబ్బులుగాని అక్షయ్ సాయంతో ఇవ్వబోతున్నామని గణేశ్ ఆచార్య తెలిపారు!