NTV Telugu Site icon

Akshay Kumar: ఈసారి హిట్ కొట్టడం గ్యారెంటీ…

Akshay Kumar

Akshay Kumar

బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్, ఇమ్రాన్ హష్మీ హీరోలుగా నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘సెల్ఫీ’. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘డ్రైవింగ్ లైసెన్స్’ సినిమాకి రీమేక్ గానే ‘సెల్ఫీ’ సినిమా తెరకెక్కుతుంది. ఒరిజినల్ వర్షన్ లో పృథ్వీ రాజ్ సుకుమారన్ ప్లే చేసిన రోల్ ని రీమేక్ లో అక్షయ్ కుమార్ ప్లే చేస్తున్నాడు. యాక్టర్ సూరజ్ వెండ్రమూడు నటించిన పోలిస్ పాత్రలో ఇమ్రాన్ హష్మీ నటిస్తున్నాడు. ఒక ట్రాఫిక్ ఇన్స్పెక్టర్, స్టార్ హీరోకి మధ్య జరిగిన ఇగో ఇష్యూ ఎంత దూరం వెళ్లింది అనేది ఈ కథలో సూపర్బ్ గా ప్రెజెంట్ చేశారు. మలయాళంలో లాల్ డైరెక్ట్ చేసిన డ్రైవింగ్ లైసెన్స్ సినిమాని హిందీలో రాజ్ మెహతా డైరెక్ట్ చేస్తున్నాడు.

ఒరిజినల్ వర్షన్ మలయాళంలో సూపర్ హిట్ అయ్యింది కాబట్టి హిందీలో కూడా సూపర్ హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒరిజినల్ వర్షన్ ని ప్రొడ్యూస్ చేసిన సుప్రియ మీనన్, బాలీవుడ్ లో కూడా కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తుంది. ఫిబ్రవరి 24న ఆడియన్స్ ముందుకి రానున్న ‘సెల్ఫీ’ మూవీ ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఒరిజినల్ వెర్షన్ ‘డ్రైవింగ్ లైసెన్స్’కి కంప్లీట్ గా స్టిక్ అయ్యి ఎలాంటి ఎక్స్ట్రా ఎలిమెంట్స్ మిక్స్ చెయ్యకుండా సెల్ఫీ సినిమాని తెరకెక్కించారు అనే విషయం ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. సూరజ్ ప్లే క్యారెక్టర్ లో కనిపించిన ఇమ్రాన్ హష్మీ చాలా నేచురల్ గా ఉన్నాడు. ఈ సినిమా అతని కెరీర్ లో ఒక మైల్ స్టోన్ గా నిలిచే ఛాన్స్.

ఈ సినిమాలో ఎవరు హీరో, ఎవరు విలన్ అనే విషయాన్ని స్పష్టంగా చెప్పడం కష్టం. ఇది ఇద్దరు ఇగో ఉన్న వ్యక్తుల కథ, అంతే.. మంచి చెడు లేవు. పరిస్థితులే మనుషులతో అన్నీ చేయిస్తాయి, ఇగోకి వెళ్తే ఎలాంటి పరిణామాలని ఫేస్ చెయ్యాల్సి వస్తుంది అనే విషయాలని సెల్ఫీ సినిమాలో సినిమాటిక్ స్టైల్ లో చూడొచ్చు. ఇదిలా ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ తెలుగు రీమేక్ రైట్స్ ని రామ్ చరణ్ సొంతం చేసుకున్నాడు. మరి ఈ మూవీ ఎవరితో చేస్తాడు? ఎవరు హీరోగా నటిస్తారు అనే విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు.