సినిమా కోసం నటులు పడే కష్టాలు చెప్పలేనివి. కొందరు యాక్షన్ సీన్లలో రిస్క్ తీసుకుంటే, మరికొందరు ఫన్నీ సన్నివేశాలకోసం కూడా భయంకరమైన సిట్యువేషన్స్ ఎదుర్కొంటారు. అలాంటిదే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌కూ జరిగింది. ఇటీవల ప్రముఖ కొరియోగ్రాఫర్ చిన్నిప్రకాశ్ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయటపెట్టారు. చిన్నిప్రకాశ్ మాట్లాడుతూ..
Also Read : Kerala State Film Awards 2025 : 10 అవార్డులు దక్కించుకుని సంచలనం సృష్టించిన మలయాళ చిత్రం..
“అక్షయ్ చాలా డెడికేటెడ్ ఆర్టిస్ట్. తన పాత్ర కోసం ఎంత కష్టమైనా వెనకడుగు వేయడు. నేను ఆయనతో దాదాపు 50 కి పైగా పాటలు చేశాను. కానీ ఒక్కసారి కూడా స్టెప్స్ మార్చమని అడగలేదు. ‘ఖిలాడి (1992)’ సినిమాలోని ఓ పాటలో ఆయనపై 100 కోడిగుడ్లు విసరడం అనే సీన్ ఉంది. చుట్టూ ఉన్న అమ్మాయిలంతా ఆయనపై గుడ్లు విసిరారు. అవి పగిలి శరీరమంతా అంటుకున్న, గాయపడ్డ, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. షూటింగ్ అయిపోయాక గుడ్ల వాసన పోవడానికి చాలా ఇబ్బంది పడ్డారు. అయినా ఓపికగా భరించాడు” అని అన్నారు. అక్షయ్ కష్టపడే తీరు గురించి మరింతగా వివరించిన చిన్నిప్రకాశ్ ఇలా అన్నారు.. “ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని దశాబ్దాలు అయినా ఆయనలో మార్పు లేదు. నేను ఇటీవల చేసిన ‘హౌస్‌ఫుల్’ సినిమాలో కూడా అదే ప్యాషన్ కనిపించింది. ప్రేక్షకుల కోసం ఏ రిస్క్‌కైనా సిద్ధంగా ఉంటాడు. మీరు పొరపాటున ‘10వ అంతస్తు నుంచి దూకు’ అన్న, దాన్ని కూడా చేయడానికి వెనకడుగు వేయడు” అని అక్షయ్‌పై ప్రశంసలు కురిపించారు.
