NTV Telugu Site icon

Akshay Kumar: ఆ సినిమాల నుంచి నన్ను కావాలనే తప్పించారు: అక్షయ్ కుమార్

Akshai Kumar

Akshai Kumar

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్న వరుస చిత్రాలో ‘స్కై ఫోర్స్‌’ మూవీ ఒకటి. సందీప్‌ కెవ్లానీ, అభిషేక్ క‌పూర్ సంయుక్తంగా ద‌ర్శక‌త్వం వ‌హించిన ఈ సినిమా జ‌న‌వ‌రి 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. భారత దేశ మొదటి వైమానిక దాడి ఆధారంగా ఈ సినిమా రూపొందగా. అయితే తాజాగా ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా అక్షయ్ కుమార్.. ప్రేక్షకులపై OTT ప్రభావం గురించి మాట్లాడుతూ..వైరల్ కామెంట్స్ చేశాడు

అక్షయ్ కుమార్ మాట్లాడుతూ.. ‘కరోనా తర్వాత సినిమాల తీరు, ప్రేక్షకుల అభిరుచి పూర్తిగా మారిపోయింది. అందుకే థియేటర్లలో సక్సెస్ రేట్ పడిపోయింది. ప్రేక్షకులు బాగా ఓటీటీలకు అలవాటు పడిపోయారు. ఏదైనా సినిమా రిలీజైతే ఓటీటీలోకి వచ్చాక చూస్తాం అనే పరిస్థితి వచ్చేసింది. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాలంటే ఎలాంటి సినిమాలు చేయాలో తెలియని అయోమయం నెలకొంది. వాళ్లు ఎక్కువగా ఎంటర్టైనర్, భారీ చిత్రాలు ఇష్టపడుతున్నారు. కానీ అని వేళల బారీ సినిమాలు హిట్ కాకపోవచ్చు’ అని తెలిపాడు.

అయితే బాలీవుడ్ లో అక్షయ్ నటించిన ‘భూల్ భులయ్యా’ మూవీ ఎంత సూపర్ హిట్ అయిందో మనకు తెలిసిందే. కానీ తర్వాత వచ్చిన ఈ మూవీ రెండు సీక్వెల్స్‌లో కార్తీక్ ఆర్యన్ హీరోగా చేశాడు. అవి ఇంకా పెద్ద సక్సెస్ అయ్యాయి. ఇందులో భాగంగా మరి సీక్వెల్స్‌లో మీరెందుకు నటించలేదు అని అక్షయ్‌ని అడిగితే.. ‘వాటిలో నేను నటించకపోవడం అంటూ ఏమీ లేదు.. ఆ చిత్రాల నుంచి నను తప్పించారు’ అని అక్షయ్ సిపుల్‌గా తెలిపారు. ప్రజంట్ ఈ మాటలు వైరల్ అవుతున్నాయి.