Welcome To The Jungle OTT: పొట్ట చెక్కలయ్యే కామెడీతో 192 కోట్ల గ్రాస్.. ఓటీటీలో 24 గంటల్లోనే నంబర్ 1 ట్రెండింగ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Welcome To The Jungle OTT: థియేటర్లలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన బాలీవుడ్ మల్టీస్టారర్ కామెడీ ఎంటర్టైనర్ ‘వెల్కమ్ టు ది జంగిల్’ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను కూడా అలరిస్తోంది. దాదాపు రెండు నెలల థియేట్రికల్ రన్ తర్వాత జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్కు వచ్చిన ఈ సినిమా.. విడుదలైన 24 గంటల్లోనే టాప్ ట్రెండింగ్ జాబితాలో నంబర్ 1 స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించిన ఈ మూవీ.. ఇప్పుడు డిజిటల్ గా కూడా అదే జోరును కొనసాగిస్తోంది. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘వెల్కమ్ టు ది జంగిల్’ (Welcome To The Jungle) జూన్ 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ‘వెల్కమ్’ ఫ్రాంచైజీలో మూడో భాగంగా వచ్చిన ఈ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రిలీజ్ తర్వాత విమర్శకుల నుంచి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ, ప్రేక్షకులు మాత్రం ఈ కామెడీ ఎంటర్టైనర్కు మంచి ఆదరణ చూపించారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.192 కోట్ల గ్రాస్ వసూలు చేసి, ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
ఇప్పుడు ఈ సినిమా ఆగస్టు 21 నుంచి జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఓటీటీలో విడుదలైన కేవలం ఒక్క రోజులోనే ఈ మూవీ టాప్ 10 సినిమాలు, సిరీస్‌లను దాటేసి నంబర్ 1 ట్రెండింగ్ స్థానాన్ని కైవసం చేసుకుంది. దీంతో థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులతో పాటు మరోసారి ఈ కామెడీని ఆస్వాదించాలనుకునే అభిమానులు కూడా పెద్ద ఎత్తున సినిమాను చూస్తున్నట్లు తెలుస్తోంది. ‘వెల్కమ్ టు ది జంగిల్’ ప్రత్యేకత దాని భారీ తారాగణమే. అహ్మద్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అక్షయ్ కుమార్‌తో పాటు సునీల్ శెట్టి, జాకీ ష్రాఫ్, అర్షద్ వార్సీ, అఫ్తాబ్ శివదాసాని, రవీనా టాండన్, దిశా పటానీ, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇంత పెద్ద మల్టీస్టారర్ కలయికతో పాటు ఫ్రాంచైజీకి ప్రత్యేకమైన కామెడీ శైలిని కొనసాగిస్తూ ఈ సినిమాను రూపొందించారు.
Also Read
- Ramayana : 'రామాయణ' లీక్‌పై మేకర్స్ వార్నింగ్.. షేర్ చేస్తే జైలుకే!
- Mumbai Police High Alert: గ్యాంగ్స్టర్ల టార్గెట్‌లో బాలీవుడ్ స్టార్స్..! సినీ నటులకు పోలీసుల వార్నింగ్.. వాటి జోలికి వెళ్లకండి..!
- Nayanthara: క్రేజ్ ఉంది.. కానీ కలెక్షన్లు లేవు.! బాక్సాఫీస్ వద్ద నయనతారకు వరుస షాక్‌లు..
- Ramayana Box Office Collections: బాక్సాఫీస్ వద్ద 'రామాయణ' ప్రభంజనం.. మొదటి భారతీయ చిత్రంగా అరుదైన ఘనత!
దాదాపు 2 గంటల 43 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాలో కామెడీనే హైలెట్ గా నిలుస్తుంది. వరుసగా వచ్చే ఫన్నీ సన్నివేశాలు, డైలాగులు, మల్టీస్టారర్ కాంబినేషన్లు ప్రేక్షకులను చివరి వరకు ఎంటర్టైన్ చేసేలా ఉంటాయి. అందుకే థియేటర్లలో మంచి స్పందన తెచ్చుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోనూ అదే ఊపు కొనసాగిస్తూ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. థియేటర్లలో చూసే అవకాశం కోల్పోయిన వారికి, ‘వెల్కమ్’ ఫ్రాంచైజీ అభిమానులకు జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ‘వెల్కమ్ టు ది జంగిల్’ ఇప్పుడు ఒక మంచి వీకెండ్ ఎంటర్టైనర్ గా మారింది.
తాజావార్తలు
-
Kolkata-Sairang Express Derails: రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన కోల్‌కతా-సైరాంగ్ ఎక్స్‌ప్రెస్..
-
Suryakumar Yadav: భార్య ఇచ్చిన సలహా తన ఆలోచనా విధానాన్ని మార్చేసింది.. జట్టులో స్థానం కోల్పవడంపై ఓపెనైన స్కై..!
-
Alcohol Sales: అమెరికా, చైనాను మించి భారతీయులే అతిపెద్ద తాగుబోతులు!
-
Amit Shah Vizag Visit: నేడు విశాఖకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. రెండు కీలక సదస్సులకు శ్రీకారం
-
Aryaveer Sehwag: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న.. వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు ఎమోషనల్.!
ట్రెండింగ్
-
రోల్స్ రాయిస్‌కు పోటీగా BYD కొత్త కారు.. 1,000+ కి.మీ. రేంజ్, 360 డిగ్రీలు తిరిగే BYD Yangwang Altior..!
-
New Zealand Test Squad: టీమిండియాతో టెస్ట్ సమరానికి కివీస్ రెడీ.. 14 మందితో జట్టు ప్రకటన!
-
National Education Day 2026: బట్టీ పద్ధతులకు చెక్.. ఏఐ యుగంలో ‘క్రిటికల్ థింకింగ్’
-
Kitchen Storage Tips : ఆవాలు ఎక్కువ కాలం తాజాాగా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే పాడవవు
-
Jio Recharge: Buy 1 Get 1 ఆఫర్ తో ఈ రెండు ప్లాన్లపై డబుల్ బెనిఫిట్స్..!