అటు యాక్షన్ తోనూ, ఇటు కామెడీతోనూ కబడ్డీ ఆడేస్తూ మురిపిస్తున్నాడు స్టార్ హీరో అక్షయ్ కుమార్. మళయాళ దర్శకుడు ప్రియదర్శన్, అక్షయ్ తో తీసిన చిత్రాలతోనే బాలీవుడ్ భలేగా మ్యాజిక్ చేశాడు. వీరి కాంబోలో వచ్చిన తొలి సినిమా ‘హేరా ఫేరీ’ కితకితలు పెడుతూనే కాసులు రాల్చుకుంది. తరువాత వచ్చిన వీరి సినిమాల్లో ‘గరమ్ మసాలా’ సూపర్ హిట్, ‘భాగమ్ భాగ్’ సూపర్ హిట్, ‘గరమ్ మసాలా’ సూపర్ హిట్, ‘భూల్ భులయ్యా’ హిట్, ‘దే ధనా ధన్’ పరవాలేదు అనిపించాయి. దాంతో బాలీవుడ్ లో అక్షయ్ కుమార్, ప్రియదర్శన్ కాంబోకు ఇప్పటికీ ఎంతో క్రేజ్ ఉంది. వీరిద్దరి కలయికలో మరో సినిమా రాబోతోంది. ఈ విషయం అక్కీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ అని చెప్పక తప్పదు.
Read Also : HBD Allu Arjun : రూల్ చేయడానికి ‘పుష్ప’ రెడీ… కానీ ప్లాన్ చేంజ్
అక్షయ్ కుమార్ కు ఉన్న ఫాలోయింగ్ ను దృష్టిలో పెట్టుకొని, యాక్షన్, కామెడీ మిక్స్ చేసి ఈ సారి ప్రియదర్శన్ తీయబోయే సినిమా కథను తయారు చేసినట్టు తెలుస్తోంది. అక్షయ్ ఈ యేడాది ‘బచ్చన్ పాండే’తో వచ్చాడు కానీ, పరాజయం పలకరించింది. “పృథ్వీరాజ్, రక్షాబంధన్, రామ్ సేతు, మిషన్ సిండ్రెల్లా” వంటి చిత్రాలలో అక్షయ్ నటించాడు. ఆ సినిమాలు వరుసగా విడుదల కావలసి ఉంది. ఇక “ఓ మై గాడ్ -2, సెల్ఫీ” చిత్రాల్లోనూ అక్షయ్ నటించాడు. ఈ నేపథ్యంలో అక్కీతో ప్రియదర్శన్ తీసే సినిమా ఈ యేడాది సెట్స్ కు వెళ్ళినా విడుదలయ్యేది మాత్రమే వచ్చే సంవత్సరమే! మరి ఈ సారి అక్షయ్, ప్రియదర్శన్ కాంబో ఏ తీరున మ్యాజిక్ చేస్తుందో చూడాలి.
Akshay Kumar
