NTV Telugu Site icon

Prathibimbalu: అక్కినేని సినిమా అర్ధశతదినోత్సవం

Anr

Anr

Prathibimbalu: అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘ప్రతిబింబాలు’ సినిమా దాదాపు 40 సంవత్సరాల తర్వాత విడుదలైన సంగతి తెలిసిందే. సింగీతం శ్రీనివాసరావు, కెయస్. ప్రకాశరావు దర్శకత్వంలో జయసుధ, తులసి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను విష్ణుప్రియ సినీ కంబైన్స్ పతాకంపై జాగర్లమూడి రాధాకృష్ణ నిర్మించారు. అందుబాటులో ఉన్న సాంకేతికతకు అనుగుణంగా ఈ సినిమాను నవంబర్ 5న రాజేశ్వర్ రాచర్ల సహాయసహకారాలతో విడుదల చేశారు. ఈ సినిమా అర్ధశతదినోత్సవాన్ని చిత్తూరు జిల్లా, అరగొండలోని కృష్ణ థియేటర్ లో ఈ నెల 28న నిర్వహించనున్నారు. ఉదయం వేడుకలను నిర్వహించిన అనంతరం ‘ప్రతిబింబాలు’ చిత్ర ప్రదర్శన ఉంటుందని, ఆ తర్వాత అతిథులు కాణిపాకం పుణ్యక్షేత్రం సందర్శిస్తారని నిర్మాతలు తెలియచేశారు.