Sobhita : అక్కినేని శోభిత అప్పుడప్పుడు షాకింగ్ పోస్టులు చేస్తూ ఉంటుంది. తన రొటీన్ లైఫ్ లో జరిగే వాటిని, అలాగే చైతూతో ఆమె చేసే అల్లరికి సంబంధించిన పోస్టులు పెడుతూ ఉంటుంది. అందుకే ఆమె ఐడీలకు మంచి ఫాలోయింగ్ ఉంటుంది. తాజాగా తనను తాను ఇండియన్ అంకుల్ తో పోల్చుకుంది. ఇందుకు సంబంధించిన పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజా ఫొటోల్లో ఆమె కెమెరా వైపు కాకుండా ఇంకో వైపు చూస్తోంది. ఇలా ఎందుకు చూస్తుందో కూడా రాసుకొచ్చింది.
Read Also : Srinidhi Shetty : ప్రభాస్ మీద శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్.. ఇలా అనేసిందేంటి..
నాకు కెమెరాల దిక్కు కాకుండా స్క్రీన్ లో నన్ను నేను చూసుకోవడం చాలా ఇష్టం. అందుకే నా ఫొటోలు కెమెరాలకు స్ట్రయిట్ గా ఉండవు. కానీ ఇలా ఉండటం నాకు ఇష్టమే. ఇండియన్ అంకుల్స్ ఇలాగే ఫోజులు ఇస్తారు కదూ.. నన్ను కూడా ఇండియన్ అంకుల్ అనుకోండి పర్లేదు అంటూ రాసుకొచ్చింది. ఆమె చేసిన పోస్టుపై రకరకాలుగా స్పందిస్తున్నారు. శోభిత ప్రస్తుతం తమిళంలో పా రంజిత్ డైరెక్షన్ లో ఓ భారీ సినిమా చేస్తోంది. దానికి సంబంధించిన పనులు త్వరలోనే స్టార్ట్ కాబోతున్నాయి.
Read Also : Little Hearts : దుమ్ము లేపిన లిటిల్ హార్ట్స్.. మరో రికార్డు
