Site icon NTV Telugu

సోగ్గాడు మళ్ళీ వచ్చాడు… ‘బంగార్రాజు’ టీజర్

‘మనం’ తర్వాత ‘బంగార్రాజు’ కోసం నాగార్జున, నాగ చైతన్య రెండవ సారి కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. బ్లాక్ బస్టర్ మూవీ “సోగ్గాడే చిన్ని నాయన” చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు న్యూ ఇయర్ సందర్భంగా మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. టీజర్‌లో ప్రధాన పాత్రధారులందరినీ పరిచయం చేశారు. నాగార్జున తన విలక్షణమైన పంచెకట్టులో ‘బంగార్రాజు’గా ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో నాగ చైతన్య అధునాతన దుస్తులలో స్టైలిష్ గా కన్పించారు. ‘బంగార్రాజు’లాగే చిన ‘బంగార్రాజు’ కూడా సోగ్గాడే. కృతి శెట్టి గ్రామ సర్పంచ్… ఆమెను ఆకట్టుకోవడానికి చై ఆమెను దేశానికి సర్పంచ్‌గా చేస్తానని చెప్పిన సన్నివేశంతో పాటు అన్ని సీన్స్ ఆహ్లాదకరంగా ఉన్నాయి. ఇక టీజర్ లో నాగ్, రమ్యకృష్ణ జోడి, చై, కృతి కెమిస్ట్రీ మ్యాజికల్‌గా ఉంది.

Read Also : శివ కార్తికేయన్ టాలీవుడ్ ఎంట్రీ కన్ఫర్మ్… అఫీషియల్ అనౌన్స్మెంట్

టీజర్లో విజువల్స్ తో పాటు మంచి యాక్షన్ డోస్ కూడా చూపించారు మేకర్స్. వీడియోలో యమ ధర్మరాజుగా కనిపించాడు నాగబాబు. టీజర్ ద్వారా అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారెంటీ అనే విషయాన్నీ మేకర్స్ స్పష్టం చేశారు. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో అనూప్ రూబెన్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరొక హైలెట్. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు మేకర్స్. అయితే ‘బంగార్రాజు’ సంక్రాంతి బరిలోనే నిలవనున్నాడు. ఈ విషయాన్ని టీజర్ లోనే తెలిపారు.

Exit mobile version