Site icon NTV Telugu

Akkineni Nagarjuna: ఇక్కడ పవన్ కళ్యాణ్.. అక్కడ కార్తీ..

King

King

Akkineni Nagarjuna: కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ, రాశీ ఖన్నా జంటగా పిఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సర్దార్. తెలుగు, తమిళ్ భాషల్లో ఈ సినిమా అక్టోబర్ 21 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ చిత్రంలో సీనియర్ నటి లైలా ప్రధాన పాత్రలో నటిస్తోంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మేకర్స్ హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ ఈవెంట్ కు అక్కినేని నాగార్జున గెస్ట్ గా విచ్చేశారు. ఇక ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తోంది నాగార్జుననే కావడం విశేషం. ఈ వేదికపై నాగార్జున మాట్లాడుతూ “తమ్ముడు కార్తీని ఇంత ప్రేమతో ఇన్వైట్ చేశారు చాలా చాలా థాంక్స్. నేను
కార్తీతో ఊపిరి సినిమా చేశాను. అప్పటి నుండి మొదలయ్యింది మా అనుబంధం. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాని ప్రజంట్ చేస్తుంది.. చాలా సంతోషంగా ఉంది.. చాలా గర్వంగా వుంది. మొన్ననే కార్తీ, నేను ట్రైలర్ గురించి మాట్లాడుకున్నాం. ట్రైలర్ అదిరిపోయింద ని చెప్పగానే ఈ సినిమా చేసినందుకు కార్తీ గర్వపడుతున్నానని చెప్పాడు.

కార్తీ అన్న సూర్య సూపర్ స్టార్. ఆ సూపర్ స్టార్ అన్నగా ఉన్నప్పుడు ఆ సూపర్ స్టార్ నీడ నుండి బయటికి వచ్చి తన వ్యక్తిగతంగా ప్రూవ్ చేసుకోవడం చాలా తక్కువ. అటువంటి వాళ్లను అరుదుగా నేను ఇద్దరినే చూసాను. ఇక్కడ మెగాస్టార్ తమ్ముడు పవన్ కళ్యాణ్.. కర్ణాటకలో శివన్న తమ్ముడు పునీత్ రాజ్ కుమార్.. తమిళనాడులో సూర్య తమ్ముడు కార్తీ. అది అంత ఈజీ పని కాదు. కార్తీ ఆ స్టార్ డమ్ ను ఎలా సంపాదించాడంటే.. బోల్డ్ గా, చాలా వైవిధ్యమైన సినిమాలు చేసిఅన్న షాడో నుంచి బయటపడి ఇప్పుడు సూర్య అంత సూపర్ స్టార్ అయ్యాడు. కార్తీ తెలుగులో మాట్లాడటమే కాదు పాటలు కూడా పాడతాడు. తెలుగు మాట్లాడేవాళ్ళని మనమెప్పుడు వదలం. ఇక్కడే పెట్టుకుంటాం. అందుకే తెలుగువారు అంతగా అభిమానిస్తారు.. ఈ సినిమాను కూడా అంతే అభిమానిస్తారు. అభిమన్యుడు డైరెక్టర్ పిఎస్ మిత్రన్ అద్భుతమైన దర్శకుడు. ఆ సినిమాలానే సర్దార్ ను కూడా గొప్పగా తీసుంటాడని నమ్ముతున్నాను. అక్టోబర్ 21న ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయండి” అని చెప్పుకొచ్చారు.

Exit mobile version