Akkineni Nagarjuna : అఖిల్‌కి హిట్ ఇవ్వమని శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకున్నాను

Akkineni Nagarjuna

Akkineni Nagarjuna

 అఖిల్ నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘లెనిన్’ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో, పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. తొలిరోజు ఏకంగా రూ. 16.7 కోట్ల గ్రాస్ తో భారీ వసూళ్లు రాబట్టింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్‌గా నిర్వహించిన సక్సెస్ మీట్‌కు కింగ్ అక్కినేని నాగార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో కొడుకు సక్సెస్ చూసి ఒక తండ్రిగా నాగ్ కాస్త ఎమోషన్ అయ్యారు.

నాగార్జున మాట్లాడుతూ.. “నేను గతంలో ‘అన్నమయ్య’ సినిమా చేసినప్పుడు కానీ, ఆ తర్వాత ఎప్పుడు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లినప్పుడు కానీ దేవుణ్ణి ప్రత్యేకంగా ఏమీ కోరుకోలేదు. నా జీవితంలో నాకు అన్నీ ఉన్నాయి భగవంతుడు అన్నీ ఇచ్చాడు. కానీ ఇటీవల నేను స్వామివారి దర్శనానికి వెళ్లినప్పుడు మాత్రం మనస్ఫూర్తిగా ఒక్కటే కోరుకున్నాను.. మా అఖిల్‌కు ఒక మంచి హిట్ ఇవ్వండి స్వామి అని అడిగాను. ఆ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో, ప్రేక్షకుల ప్రేమాభిమానాలతో ఈరోజు ‘లెనిన్’ రూపంలో ఒక సాలిడ్ హిట్ వచ్చింది”. ఈ సినిమా హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే కూడా అఖిల్ కు ఒక మంచి హిట్ పడాలని గట్టిగా కోరుకుందట. చివరికి ఆమె కోరిక కూడా నెరవేరింది. ‘లెనిన్’ మూవీతో ఆమెకు కూడా ఒక సూపర్ హిట్ లభించింది” అని నాగార్జున పేర్కొన్నారు. అఖిల్ 2.0 రేంజ్ మాస్ పర్ఫార్మెన్స్, భాగ్యశ్రీ యాక్టింగ్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయని, ఇంతటి ఘనవిజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.