Site icon NTV Telugu

Akkineni Nagarjuna: ఈ లుక్ లో ఒక సినిమా పడితే మాస్టారూ…

Nag

Nag

Akkineni Nagarjuna: ఘోస్ట్ సినిమా తరువాత అక్కినేని నాగార్జున కొత్త సినిమా ప్రకటించింది లేదు. దీంతో నాగ్ ఎందుకు ఇంత గ్యాప్ తీసుకుంటున్నాడు అని అభిమానులు ఆరాలు తీస్తూనే ఉన్నారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం నాగ్ గ్యాప్ ఏం తీసుకోలేదట.. తన తదుపరి సినిమాకు ప్లానింగ్స్ లో ఉన్నాడట. రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ దర్శకత్వంలో నాగ్ ఒక సినిమా చేస్తున్నాడని, ఆ సినిమా కథ వినే పనిలో ఉన్నాడని టాక్ నడుస్తోంది. ఇక మధ్య మధ్య కమర్షియల్ యాడ్స్ లో కనిపిస్తూ అభిమానులను పలకరిస్తున్న నాగ్ ఇటీవల హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ఫార్ములా ఈ రేస్ లో కొడుకులతో పాటు సందడి చేశాడు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ రేసులో నాగ్ కొత్త లుక్ లో దర్శనమిచ్చాడు. నాగ్ వయసు 63. ఇప్పటికి ఫిట్ గా ఉంటూ కుర్ర హీరోలకు పోటీ ఇస్తూనే ఉన్నాడు. అందుకే నాగ్ ను మన్మధుడు అని చెప్పుకొస్తారు.

Bandla Ganesh: బండ్ల గుండు బాస్ లుక్.. కళ్లన్నీ ఆ కళ్లజోడు మీదే

తాజా లుక్ లో నాగ్ మరింత యంగ్ గా కనిపిస్తున్నాడు. అల్ట్రా స్టైలిష్ లుక్ లో అదరగొట్టేశాడు. దీంతో అభిమానులు ఈ లుక్ లో నాగ్ కు ఒక మాస్ సినిమా పడితే బాక్సాఫీస్ లు బద్దలు అయ్యినట్లే అంటూ చెప్పుకొస్తున్నారు. నిజం చెప్పాలంటే.. ప్రతి సినిమాకు నాగ్ లుక్ లో తనదైన ప్రత్యేకతను చూపిస్తూ ఉంటాడు. ఈ లుక్ లో లైట్ గా వచ్చిన గడ్డం, చెదిరిన జుట్టుతో కుర్ర హీరోలా కనిపించాడు. మరి అభిమానుల కోరికను నాగ్ పట్టించుకుంటాడా..? ఈ లుక్ లో కొత్త సినిమాను ఏమైనా మొదలుపెడతాడా..? అనేది చూడాలి.

Exit mobile version