NTV Telugu Site icon

Nagarjuna: మొన్న చిరు నేడు నాగ్… సతీసమేతంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అక్కినేని హీరో

Nagarjuna Meets Revanth Reddy

Nagarjuna Meets Revanth Reddy

Akkineni Nagarjuna Meets Telagana CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున దంపతులు కలిశారు. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత నాగార్జున దంపతులు ఆయనను కలవడం ఇదే మొదటిసారి కాగా మర్యాదపూర్వకంగానే సీఎంను వారు కలిసినట్టు చెబుతున్నారు. ఈ క్రమంలో సీఎంకు వారు పుష్పగుచ్ఛం ఇచ్చి ఫొటోలు సైతం దిగారు. ఇక రేవంత్ రెడ్డి సీఎం అయినప్పటి నుంచి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి పలు రంగాలకు చెందిన ప్రముఖులు కలుస్తున్నారు. అయితే సినీ రంగం నుంచి మాత్రం ముందుగా చిరంజీవి కలువగా ఇప్పుడు అక్కినేని నాగార్జున దంపతులు కలిశారు.

KBC 15 : కేబీసీ 15ముగింపు.. ఏడుస్తూ వీడ్కోలు పలికిన అమితాబ్ బచ్చన్

శ‌నివారం ఉద‌యం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసానికి చేరుకున్న నాగార్జున దంపతులు రేవంత్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అయ‌న‌కు శుభాకాంక్షలు తెలిపారు. ప్ర‌స్తుతం ఆ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రేవంత్ సీఎం అయిన అనంత‌రం ప‌లువురు టాలీవుడ్ సినీ ప్ర‌ముఖులు రేవంత్‌ను క‌లిసి శుభాకాంక్షలు తెలిపేందుకు అపాయింట్మెంట్ కూడా అడిగారు. త్వరలోనే టాలీవుడ్ పెద్దలు అందరూ కలిసి వెళ్లి రేవంత్ కు శుభాకాంక్షలు తెలపనున్నారు. ఇక సీఎం రేవంత్ 100 రోజుల్లో ఆరు గ్యారంటీల అమలు దిశగా ప్రజా పాలన కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. ఇక అక్కినేని నాగార్జున ‘నా సామిరంగ’ అనే సినిమాలో నటిస్తున్నారు. మూవీ ఫస్ట్ లుక్ టైటిల్ గ్లింప్స్​తో అందరిని ఆకట్టుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది థియేటర్లలో రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.