అక్కినేని నాగేశ్వరరావు గురించి తెలుగు ప్రేక్షకులకు ఎలాంటి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది ఆయన శతజయంతి సందర్భంగా అనేక ఉత్సవాలు కూడా నిర్వహించింది ఆయన కుటుంబం. ఇప్పుడు ఏడాది గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ లో కూడా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపద్యంలో కుటుంబం అంతా హాజరైంది. ఇక ఆయన కుమారుడు నాగార్జున సైతం ఈ వేడుకకు హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆయనకు నాగేశ్వరరావు బయోపిక్ గురించి ప్రశ్న ఎదురైంది అయితే సాధారణంగా చేయాలని ఉంది త్వరలోనే చేస్తాం అని అంటాడేమో అనుకుంటే ఆయన మాత్రం ఒక ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు. ఏఎన్నార్ బయోపిక్ గురించి ఎప్పటికప్పుడు చర్చలు జరుగుతూనే ఉంటాయి కానీ ఆయన మీద బయోపిక్ సినిమా చేయడం కంటే ఒక డాక్యుమెంటరీ చేయడం బెటర్ అని అన్నారు.
Also Read: Sobhita: ‘చైతూ’కి షాకిచ్చిన శోభిత!
ఆయన జీవితాన్ని ఆధారంగా చేసుకుని సినిమా చేయడం చాలా కష్టం. ఆయన జీవితంలో ఎన్నో హై మూమెంట్స్ ఉన్నాయి. వాటన్నింటినీ చూపించడం సినిమాని బోరింగ్ గా మార్చేస్తుంది. సినిమాకి ఎప్పుడూ ఎత్తు పల్లాలు ఉంటేనే బాగుంటుంది అయితే ఆయన పెట్టి పుట్టాడు అందుకే ఎక్కువగా ఆయన జీవితంలో హై మూమెంట్స్ మాత్రమే ఉన్నాయని చెప్పుకొచ్చాడు. అయితే ఆయన జీవితం మీద డాక్యుమెంటరీ చేసే ఉద్దేశం ఉందని మాత్రమే వెల్లడించారు. ఇక ఇదే వేడుకలో తన తండ్రి ఆత్మహత్య చేసుకోవాలనుకున్న విషయాన్ని కూడా నాగార్జున ప్రస్తావించారు. అప్పట్లో ఈ విషయం సీరియస్ గా తీసుకొని ఆయన చనిపోయి ఉంటే ఇప్పటికి తమ కుటుంబం ఇక్కడ ఉండేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.