అక్కినేని నాగచైతన్య-సమంత విడాకులు తీసుకున్నారు.. వారి కెరీర్‌పై ఫోకస్ పెడుతూ.. తర్వాత ప్రాజెక్టులను ఎంపిక చూసుకుంటూ ముందుకు సాగుతున్నారు.. కానీ, టాలీవుడ్‌లో ఈ వ్యవహారం ఇప్పటికీ హాట్ టాపిక్‌గా సాగుతోంది.. చై-సామ్‌లో ఎవరు ముందుకు విడాకుల ప్రతిపాదన తీసుకొచ్చారు..? ఈ సెలబ్రిటీ కపుల్ విడిపోవడానికి కారణం ఇదేనా..? నాగ చైతన్యతోనే ప్లాబ్లమ్ స్టార్ట్ అయ్యిందా..? సమంతే విడాకుల కోసం పట్టుబట్టిందా? ఇలా అనేక కథనాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉన్నాయి.. తాజాగా, ఈ వ్యవహారంపై అక్కినేని నాగార్జున స్పందించారని.. సమంత, నాగచైతన్యల మధ్య ఉన్న సమస్య ఏమిటి? అనేది నాకు తెలియదు.. కానీ, సమంతే మొదట విడాకులు తీసుకోవాలని నిర్ణయం తీసుకుందని.. ఆమె నిర్ణయాన్ని చైతూ కూడా అంగీకరించారని నాగ్ చెప్పినట్టు కథనాలు వెలువడ్డాయి.. అయితే, వాటిలో నిజం లేదంటూ కొట్టిపారేశారు నాగార్జున.
Read Also: గోవాలో పొలిటికల్ హీట్.. పోటీ నుంచి తప్పుకున్న మాజీ సీఎం..
చైతు-సమంత విడాకుల విషయంలో నాగార్జున స్పందించినట్టుగా వస్తున్న వార్తలను సోషల్ మీడియా వేదికగా కొట్టిపారేశారు నాగార్జున.. అవి కేవలం రూమర్స్ మాత్రమేనని.. దయచేసి రూమర్స్‌ని వార్తలుగా నమ్మవద్దని కోరారు.. సోషల్ మీడియాలో నా పేరుతో వస్తున్న కామెంట్స్‌లో ఏ నిజం లేదని క్లారిటీ ఇచ్చిన నాగార్జున.. చైతు-సమంత విషయంలో నేను మాట్లాడినట్లు వస్తున్న వార్తలన్నీ అవాస్తమేనని కొట్టిపారేశారు.. ఇక, ఇదే సమయంలో.. ఇలాంటి వదంతులను వార్తలుగా మలచవద్దని మీడియాకు ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు అక్కినేని నాగార్జున.
