Akkineni Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం తండేల్. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా బుజ్జి తల్లే అంటూ.. చై.. సాయి పల్లవిని పిలిచే డైలాగ్ అయితే ఓ రేంజ్ లో హిట్ అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక నేడు వాలెంటైన్స్ డే సందర్భంగా.. ఈ డైలాగ్ ను చై, సాయి పల్లవి రీ క్రియేట్ చేశారు. బుజ్జి తల్లి వచ్చేస్తున్నా కదే.. కాస్తా నవ్వవే అని చై చెప్తుండగా.. సాయి పల్లవి వీడియోలో నవ్వుతూ కనిపించింది.
ఇక ఈ వీడియోను షేర్ చేస్తూ చై.. ప్రేక్షకులకు ప్రేమికుల రోజు శుభాకాంక్షలు చెప్పుకొచ్చాడు. “తండేల్ గ్లింప్స్ పట్ల వస్తున్న రెస్పాన్స్ చాలా థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. దానిపై నెటిజన్లు రీల్స్ చేయడం మరింత సంతోషాన్ని ఇచ్చింది. అందరిలా మేము కూడా ఒక రీల్ చేయాలని నిర్ణయించుకొని వాలెంటైన్స్ డే రోజున మీకు అందిస్తున్నాం” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో చై ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
Thrilled with the response for the #Thandel glimpse .. was also heartwarming to see so many of you make your own reels on it .. @Sai_Pallavi92 and I decided to make our own 🙂 celebrate love everyday ! Happy Valentine’s Day from Team #Thandel @chandoomondeti @ThisIsDSP… pic.twitter.com/KaLQT0is5Q
— chaitanya akkineni (@chay_akkineni) February 14, 2024
