NTV Telugu Site icon

Naga Chaitanya: ఇంపాక్ట్ చూపిస్తున్న ‘కస్టడీ’ గ్లిమ్ప్స్…

Custody

Custody

2022లో బాగా డిజప్పాయింట్ చేసిన హీరోల్లో నాగ చైతన్య ఒకడు. బంగార్రాజు సినిమాతో 2022ని సక్సస్ తో స్టార్ట్ చేసిన నాగ చైతన్య, ఆ తర్వాత రెండు సినిమాలతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు కానీ అవి ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో చైతన్య రెండు ఫ్లాప్స్ తో 2022ని ముగించాడు. 2023లో హిట్ కొట్టడంతో పాటు తన మార్కెట్ ని కూడా పెంచుకోవాలని ప్లాన్ చేసిన నాగచైతన్య, తమిళ దర్శకుడు ‘విక్రమ్ ప్రభు’తో కలిశాడు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో ‘కస్టడీ’ సినిమా తెరకెక్కుతోంది, మల్టీ లాంగ్వేజస్ లో రిలీజ్ కానున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ఇటివలే రిలీజ్ అయ్యి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ తెచ్చుకుంది.

తాజాగా న్యూ ఇయర్ సంధర్భంగా ‘కస్టడీ’ మేకర్స్ ఈ మూవీ గ్లిమ్ప్స్ ని రిలీజ్ చేసారు. కేవలం 27 సెకండ్లు మాత్రమే ఉన్న ఈ వీడియో ‘కస్టడీ’ సినిమాపై అంచనాలని పెంచింది. ఓపెనింగ్ ట్రైన్ సీక్వెన్స్, వన్ చేజ్, రివర్స్ చేసిన కార్ బ్లాస్ట్, యాక్షన్ మోడ్ లో ఉన్న నాగ చైతన్య ‘కస్టడీ’ గ్లిమ్ప్స్ లో కనిపించారు. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి ‘యువన్ శంకర్ రాజా’ మ్యూజిక్ అందిస్తున్నాడు. వచ్చే ఏడాది మే 12న ఈ సినిమా రిలీజ్ కానున్నట్లు ప్రకటించారు. గ్లిమ్ప్స్ తో మెప్పించిన చిత్ర యూనిట్ ‘కస్టడీ’ టీజర్, ట్రైలర్ లతో మరిన్ని అంచనాలు పెంచే అవకాశం ఉంది.

Show comments