Site icon NTV Telugu

Akira Nandan: మెగా వారసుడి కటౌట్.. నమ్మేయాలి డ్యూడ్

Akira Nandan

Akira Nandan

Akira Nandan Latest Look goes viral in Social Media: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సహా మెగా అభిమానులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం ఏదైనా ఉంది అంటే అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు అకిరా నందన్ సినీ ఎంట్రీ గురించి. అకిరా నందన్ కి సినిమాల మీద ఆసక్తి ఉంది. అయితే అది తన ఫ్యామిలీ ఫాన్స్ ఎదురుచూస్తున్నట్టు నటనలో కాదు. మ్యూజిక్ లో. అయితే మనోడు కటౌట్ చూస్తే మాత్రం హీరోగా వస్తే మెగా ఫ్యామిలీకి మరో బ్లాక్ బస్టర్ హీరో దొరికేసినట్టేనని అభిమానులు అందరూ భావిస్తూ ఉంటారు. అయితే తాజాగా రేణు దేశాయ్ షేర్ చేసిన ఒక పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. పిక్ షేర్ చేసి అకీరా, ఆద్యలకు రేణూ దేశాయ్ ఇచ్చిన ఓ సలహా గురించి చెప్పుకొచ్చింది.

Bhimaa : గోపీచంద్ ఆన్ ట్రాక్.. అంచనాలు పెంచేస్తున్న భీమా ట్రైలర్

ఇప్పుడు అందరూ బ్లూ టూత్, వైర్లెస్ బ్లూ టూత్ హెడ్ సెట్ లు వాడుతున్నారు కదా? ఇలాంటివి వాడితే బ్రెయిన్‌కి ఏదైనా సమస్య రావొచ్చు అని పాతవి, వైర్‌తో ఉండే హెడ్ సెట్స్‌ను వాడమని రేణూ దేశాయ్ సలహా ఇచ్చిందట. దీంతో అమ్మ మాట మేరకు అకిరా వైర్‌తో ఉన్న హెడ్ సెట్‌ను వాడటం మొదలు పెట్టాడట. ఈ విషయాన్ని చెబుతూ రేణూ దేశాయ్ పోస్ట్ చేయగా ఆ కంటెంట్ చూడడం మానేసి ఇప్పుడు మనోడి కటౌట్ గురించి చర్చలు జరుపుతున్నారు. అకిరా నందన్ కోర మీసాలతో కనిపిస్తూ ఉండడంతో పాటు పవన్ లక్షణాలతో కనిపిస్తూ ఉండడంతో ఇక మావాడు సినిమాలకు సిద్ధం అయిపోయాడు అని అంటున్నారు. ఇక కొందరు ఆ కటౌట్ చూడండయ్యా.. హీరో అంటే ఇలాంటి కటౌట్ కదా కావాల్సింది అంటూ కామెంట్ చేస్తున్నారు. మెగా వారసుడు ఏమున్నాడు రా ? బాబు ఇది కదా అసలైన కటౌట్ అంటే అంటూ కామెంట్లు చేస్తున్నారు. నిజానికి తన కుమారుడికి మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ అని అందుకే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కి వెళ్లి మరీ మ్యూజిక్ తో పాటు ఫిలిం మేకింగ్ కోర్స్ తీసుకుంటున్నాడని గతంలో రేణు దేశాయ్ వెల్లడించింది.

Exit mobile version