Lenin movie trailer : లెనిన్ ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్.. అయ్యగారు ఆన్ ట్రాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని అఖిల్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ యాక్షన్ డ్రామా ‘లెనిన్’. చాలా కాలంగా షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా జూలై 10న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ స్పీడ్ పెంచేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన బిగ్గెస్ట్ అప్డేట్ను చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. ‘లెనిన్’ అఫీషియల్ ట్రైలర్‌ను జూన్ 30న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు.
వినరో భాగ్యం విష్ణు కథ వంటి హిట్ సినిమా దర్శకుడు మురళి కిషోర్ అబ్బురు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం గ్రామీణ నేపథ్యం, కుటుంబ భావోద్వేగాలు మరియు పవర్ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో రూపొందుతోంది. గతంలో విడుదలైన టీజర్, సాంగ్స్ సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేయగా, ఇప్పుడు రాబోతున్న ట్రైలర్ సినిమా రేంజ్‌ను మరింత పెంచుతుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ చిత్రంలో అఖిల్ సరికొత్త రగ్గడ్ లుక్‌లో కనిపించనున్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు ఫైనల్ గా జూలై 10న ‘లెనిన్’ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తుండగా, స్టార్ కంపోజర్ థమన్ సంగీతం అందిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనమ్ ఎంటర్టైన్మెంట్స్, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో అఖిల్ సాలిడ్ హిట్ కొడతాడని అఖిల్ ఫాన్స్ ధీమాగా ఉన్నారు. అటు కింగ్ నాగార్జున కూడా లెనిన్ సూపర్ హిట్ అవుతుందని గతంలో వెల్లడించారు.
Also Read
- RAPO23 : హీరో కమ్ దర్శకుడిగా రామ్ పోతినేని.. పూజ కార్యక్రమానికి టైమ్ ఫిక్స్
- AA 23 : పూజా హెగ్డేకు లోకేశ్ కనగరాజ్ మరో ఛాన్స్.. కానీ?
- Balan The Boy: 8 రోజుల్లో 24 కోట్ల వసూళ్లు.. మరో బ్లాక్ బస్టర్‌తో చిదంబరం మ్యాజిక్
- Kangana Ranaut: ఆ నటుడి పెదవిని కంగనా కొరికిందా?.. 'రివాల్వర్ రాణి' కిస్ సీన్ మళ్లీ వైరల్
తాజావార్తలు
-
Lenin movie trailer : లెనిన్ ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్.. అయ్యగారు ఆన్ ట్రాక్
-
Stokes-Archer: వికెట్ పడినా సెలబ్రేషన్స్ చేసుకొని ఆర్చర్.. స్టోక్స్ అసహనం.. అసలు కారణం ఇదే!
-
Venezuela: ప్రాణమిచ్చి పాపను కాపాడిన తల్లి.. వెనిజులా భూకంప శిథిలాల మధ్య గుండెల్ని పిండేసే కథనం!
-
RAPO23 : హీరో కమ్ దర్శకుడిగా రామ్ పోతినేని.. పూజ కార్యక్రమానికి టైమ్ ఫిక్స్
-
AA 23 : పూజా హెగ్డేకు లోకేశ్ కనగరాజ్ మరో ఛాన్స్.. కానీ?
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!