“బిగ్ బాస్ తెలుగు సీజన్-4″లో అఖిల్ సార్థక్, మోనాల్ గజ్జర్ హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ, వారిద్దరూ లవ్ లో పడ్డారు అనిపించేలా ఎపిసోడ్లు ప్రసారం అయ్యాయి. బిగ్ బాస్ అఖిల్, మోనాల్, అభిజీత్ మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీనే చూపించి, ప్రేక్షకులను అలరించారు. అయితే హౌజ్ లో సన్నిహితంగా ఉన్న అఖిల్, మోనాల్ నిజంగానే ప్రేమలో ఉన్నారని అంతా అనుకున్నారు. అయితే ‘బిగ్ బాస్’ నుంచి బయటకు వచ్చిన తర్వాత వారిద్దరూ తమ రిలేషన్ షిప్ గురించి నోరు విప్పలేదు.
Read Also : Dhanush : కొత్త సినిమాకు కష్టాలు… విభేదాలతో లిరిసిస్ట్ వాక్ అవుట్
అయితే అఖిల్ ఇప్పుడు బిగ్ బాస్ ఓటిటి వెర్షన్ “బిగ్ బాస్ నాన్-స్టాప్”లో పాల్గొంటున్నాడు. ఇందులో భాగంగానే ఇటీవల మాజీ హౌస్‌మేట్‌లకు మునుపటి సీజన్‌లో వారు చేసిన తప్పులను ఈ సీజన్‌లో సరిదిద్దుకోవాలనుకునే విషయం ఏమిటో చెప్పాలంటూ టాస్క్ ఇచ్చారు. అంతకుముందు సీజన్‌లో తాను పెద్దగా నవ్వలేదని, ఈ సీజన్‌లో అదే చేయాలనుకుంటున్నానని అఖిల్ చెప్పాడు.
ఇంతలో ఇతర హౌస్‌మేట్స్ మోనాల్‌తో అతని బంధం నిజమైనదా ? లేదా టీఆర్పీ రేటింగ్ కోసం అలా చేశారా ? అని అడిగారు. దీనిపై అఖిల్ స్పందిస్తూ.. మోనాల్‌తో తనకు నిజమైన రిలేషన్‌షిప్ ఉందని చెప్పాడు. తామిద్దరూ ఫోన్‌లో మాట్లాడుకుంటామని, ఇప్పుడు కూడా రెగ్యులర్‌గా కలుస్తున్నామని ఆయన తెలిపారు. తమ బంధానికి ‘ప్రేమ’ అనే ట్యాగ్ పెట్టబోనని, అయితే అది స్నేహం కంటే లోతైనదని చెప్పాడు. ఆ విధంగా మోనాల్‌తో తనకున్న సంబంధాన్ని బయటపెట్టాడు.
