Nagarjuna: మనోడు లెనిన్ 10th జులై వస్తున్నాడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యువ హీరో అఖిల్ అక్కినేని తదుపరి చిత్రం లెనిన్ పై టాలీవుడ్లో అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక అదిరిపోయే అప్డేట్ బయటకొచ్చింది. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్ జూన్ 25న రిలీజ్ కావాల్సి ఉంది. అయితే సినిమా వాయిదా పడి ఈ ఏడాది జులై 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సాధారణంగా సినిమాల ఆలస్యం అభిమానులను కాస్త నిరాశకు గురిచేస్తుంది. కానీ, ఇక్కడ సీన్ రివర్స్ అయింది. చిత్ర యూనిట్ చూపించిన పట్టుదల, సినిమాపై వారకున్న పిచ్చి నాగార్జునను ఎంతగానో ఆకట్టుకుందట.
నాగార్జున అసలు ఏమన్నారంటే..?
“లెనిన్ చిత్ర బృందం నా దగ్గరకు వచ్చి ఒక చిన్న రిక్వెస్ట్ అడిగారు. ఔట్పుట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా, తమ వందకు వంద శాతం శ్రమను పెట్టి… ప్రేక్షకులకు ఒక అద్భుతమైన దృశ్యకావ్యాన్ని అందించడానికి కొంచెం సమయం కావాలని కోరారు. వారిలో ఉన్న ఆ కసి, సినిమాపై ఉన్న అంకితభావం చూశాక నేను కాదనలేకపోయాను. అందుకే ఈ నిర్ణయం.” అని నాగ్ పేర్కొన్నారు ఈ ఆలస్యం వెనుక ఉన్న కారణాన్ని చెప్తూనే, అక్కినేని అభిమానులకు ఒక హామీ ఇచ్చారు కింగ్. “మనోడు జూలై 10న వస్తున్నాడు. నేను మళ్లీ మళ్లీ చెప్తున్నా… ఈసారి మీరు ఒక సరికొత్త అఖిల్‌ను వెండితెరపై చూడబోతున్నారు” అంటూ నాగార్జున ధీమా వ్యక్తం చేశారు. ఈ పోస్ట్‌తో అఖిల్ కెరీర్లోనే ‘లెనిన్’ ఒక మైల్‌స్టోన్‌గా నిలవబోతోందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మునుపెన్నడూ చూడని సరికొత్త మాస్ బాడీ లాంగ్వేజ్, నటనతో అఖిల్ థియేటర్లలో రచ్చ లేపడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
Also Read
- Varanasi : విశాఖ.. గెట్ రెడీ.. బాబు దిగుతున్నాడు!
- Kanchana 4: కాంచన - 4 లో లేడీ సూపర్ స్టార్? లారెన్స్ సినిమాలో ముగ్గురు అందమైన దెయ్యాలు!
- Dhamaal 4 Trailer : దెయ్యాలు సముద్రపు దొంగలతో గోల్ మాల్... "ధమాల్ 4" ట్రైలర్ మామూలుగా లేదుగా
- Peddi Box Office Collections: పెద్ది కలెక్షన్ల ఊచకోత... 400 కోట్ల దిశగా పరుగులు
తాజావార్తలు
-
US-Iran: 24 గంటల్లో శాంతి ఒప్పందం ఖరారు.. పాక్ ప్రధాని షరీఫ్ కీలక ప్రకటన
-
Nagarjuna: మనోడు లెనిన్ 10th జులై వస్తున్నాడు!
-
Bangladesh: క్రికెటర్‌పై పోలీసుల దాడి.. బంగ్లాదేశ్‌లో కలకలం
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Smart Kitchen Hacks: వంటింట్లో ఇలా చేస్తే శ్రమ, సమయం, డబ్బు ఆదా.. గృహిణులకు మోస్ట్ యూస్ఫుల్ టిప్స్!
ట్రెండింగ్
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!