Site icon NTV Telugu

Akhil Akkineni : రేయ్ అఖిల్ ఏంట్రా? ఇలా ఉన్నాడు!!

Akhil Latest Look

Akhil Latest Look

Akhil Akkineni Latest Look goes Viral: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమాతో హిట్టు కొట్టి తర్వాత ఏజెంట్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖిల్ తన కెరీర్ లో మరో దారుణమైన డిజాస్టర్ చూడాల్సి వచ్చింది. ఆ సినిమా రిసల్ట్ ఎంత దారుణంగా వచ్చిందంటే ఇప్పటివరకు ఆయన మరో సినిమాని అనౌన్స్ కూడా చేయలేని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతానికి అఖిల్ యూవీ క్రియేషన్స్ బ్యానర్లో అనిల్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించే సినిమాకి హీరోగా ఫైనల్ అయ్యాడు. అయితే ఈ సినిమా అనౌన్స్మెంట్ ఎప్పుడు ఉంటుందో కూడా చెప్పలేని పరిస్థితి.అయితే ఇక తాజాగా ఎయిర్పోర్టులో అఖిల్ లుక్ వైరల్ అవుతుంది.

Pushpa 2: బన్నీ ఫాన్స్ కి షాకింగ్ న్యూస్.. ఊహించని కారణంతో సినిమా వాయిదా?

ఒక రకంగా అఖిల్ లుక్ అయితే షాకింగ్ గానే కనిపిస్తోంది. పూర్తి స్థాయిలో జుట్టు పెంచేసి, గడ్డం పెంచేసి ఒక యోధుడులా తయారయ్యాడు. అయితే యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మించబోయే సినిమా ఏ జానర్ అనే విషయం మీద క్లారిటీ లేదు కానీ అఖిల్ లుక్ చూస్తుంటే ఏదైనా పీరియాడిక్ మూవీ ప్లాన్ చేస్తున్నారా? అనే అనుమానాలు అయితే కలుగుతున్నాయి. నిజానికి యూవీ క్రియేషన్ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటికే వెలువడాల్సి ఉంది. కానీ ఎందుకో సినిమా యూనిట్ ఆ విషయాన్ని కూడా వాయిదా వేస్తూ వస్తోంది. ఇక సినిమా షూటింగ్ మొదలు పెట్టాక అధికారికంగా ప్రకటిస్తారేమో వేచి చూడాల్సి ఉంది.

Exit mobile version